రాష్ట్రీయం

ఆన్‌లైన్‌లో 56,424 ఆర్జిత సేవా టిక్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 2: శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి జూన్ నెల కోటాలో మొత్తం 56,424 టిక్కెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ విడుదల చేశారు. ఆన్‌లైన్ డిప్ విధానంలో 11,149 సేవా టిక్కెట్లు విడుదల చేసినట్లు ఈ సందర్భంగా ఈఓ తెలిపారు. ఇందులో సుప్రభాతం - 7854, తోమాల-120, అర్చన -120, అష్టదళపాదపద్మారాధన - 180, నిజపాద దర్శనం -2875 టిక్కెట్లు ఉన్నాయని తెలిపారు. ఆన్‌లైన్‌లో జనరల్ కేటగిరిలో 45,275 సేవా టిక్కెట్లు ఉండగా, ఇందులో విశేష పూజ-1125, కల్యాణం - 10,875, ఊంజల్‌సేవ -2900, ఆర్జిత బ్రహ్మోత్సవం-6235, వసంతోత్సవం-9890, సహస్రదీపాలంకార సేవ - 14,250 టిక్కెట్లు ఉన్నాయని ఈఓ తెలిపారు.