రాష్ట్రీయం

ఏపీకి హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని తెలంగాణ సీఎం కేసీఆర్ సూచించారు. శనివారం ఆయన ఇక్కడ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న అంశంపై పార్లమెంట్‌లో కేంద్రాన్ని నిలదీయాలంటూ తమ పార్టీ ఎంపీలకూ సూచించామన్నారు. ఏపీకి హోదా కల్పించే అంశంలో ప్రధాని ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేది ఉంటే ఇస్తామని, లేదంటే లేదని ఖచ్చితంగా ప్రకటించాలన్నారు. ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీలో ప్రజలు డిమాండ్ చేస్తున్నారని కేసీఆర్ గుర్తు చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రానికి స్పష్టమైన వైఖరి ఉండాలని, దేశం మొత్తానికి ఒకే రకమైన న్యాయం చేయాలన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై పునర్విభజన చట్టంలో ఏమని రాశారో పరిశీలించాలని సూచించారు. తెలంగాణలో బీజేపీకి స్థానమెక్కడుందని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు వాస్తవాలను వదిలివేసి ఊహాలోకాల్లో విహరిస్తున్నారని విమర్శించారు. గోరంత అంశాలను కొండంతగా చూపుతున్నారన్నారు. ప్రధానితో పాటు, కేంద్ర మంత్రులు, కేంద్ర అధికారులు తెలంగాణ పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడి అభివృద్ధిని శ్లాఘిస్తుంటే, రాష్ట్ర నేతలు విమర్శలకు దిగడం ఎక్కడి రాజకీయమని నిలదీశారు. సద్విమర్శలను ఆహ్వానిస్తామని, దురుద్దేశ విమర్శలను సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు పదిసీట్లు కూడా రావని కేసీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని సర్కస్ ఫీట్లు చేసినా ప్రజలు నమ్మే అవకాశం లేదన్నారు. 2019 ఎన్నికల్లో తిరుగులేని మెజారీటీతో తెరాస అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.