రాష్ట్రీయం

అడవిలో అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మార్చి 3: తెలంగాణ- చత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్ నుండి మావో అగ్రనేతలు సహహా అనేకమంది తప్పించుకున్నారనే సమాచారంతో పోలీసులు అడవిని గాలిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన 10మందిలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు. మిగిలిన వారంతా చత్తీస్‌గఢ్ రాష్టవ్రాసులే. మరణించిన వారి మృతదేహలకు భద్రాచలం ప్రభుత్వాసుపత్రిలో ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో శవ పరిక్షలు పూర్తి చేశారు. మృతుల బంధువులకు మృతదేహలను అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం కూడా చర్ల, వెంకటాపురం ప్రాంతాల్లో ఎదురుకాల్పులు జరుగుతున్నాయని విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనిపై పోలీసులు నోరుమెదపలేదు. కాని అదనపు బలగాలతో ఆ ప్రాంతాన్నంత జల్లెడ పడుతున్నారు. మరణించిన వారిలో వరంగల్ జిల్లా హన్మకొండ మండలం రాంపురం గ్రామానికి చెందిన దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్, రత్న ఉన్నారు. ఇందులో స్వామి దళకమాండర్‌గా పనిచేస్తున్నారు. మిగిలిన వారంతా
చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారు. తిప్పాపురానికి చెందిన ఇత్రు, సంగంకు చెందిన బుద్రి, వీరాపురానికి చెందిన రమ, ఇంద్రావతికి చెందిన మల్లేష్, పశ్చిమ బస్తర్‌కు చెందిన కమల, రంగాయిగూడెంకు చెందిన కొసి, గంగ్లూరుకు చెందిన సుఖి, అదే ప్రాంతానికి చెందిన సోంబిలు ఉన్నారు. మృతదేహాలను చూసేందుకు అనేక మంది మాజీలతో పాటు ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కూడ భద్రాచలం వచ్చారు. కొంతమంది మృత దేహాలను చూసి తమవారు కాదని ఆనందం వ్యక్తం చేశారు. మరొవైపు మరణించిన వారిలో 7గురు మహిళలు ఉండగా అందులో 6గురు చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందినవారే. వారి బంధువులకు సమాచారం ఇచ్చామని. వస్తే మృతదేహాలను అప్పగిస్తామని లేనిపక్షంలో హైకోర్టు ఆదేశానుసారం భద్రపరుస్తామని పోలీస్ అధికారులు తెలిపారు.
ఇదిలా ఉండగా కోవర్ట్ ఆపరేషన్ ద్వారా పోలీసులు దాడిచేసి ఏకపక్షంగా కాల్పులు జరిపారని, పోలీసులు ప్రచారం చేస్తున్నట్లు అగ్రనేతలు హరిభూషణ్, చొక్కారావు, రాజిరెడ్డి చనిపోలేదని మావోయిస్ట్ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో టీఆర్‌ఎస్ నేతలపై దాడులను ముమ్మరం చేస్తామన్నారు. చత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ని, రమణ్‌సింగ్, కేసిఆర్‌లు నియంతలుగా వ్యవహరిస్తూ ప్రశ్నించే వారిని అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత చనిపోయినది ఎవరనేది తెలిసినప్పటికీ పోలీసులు మాత్రం ప్రజల్లో కొంత అలజడి సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఏదో చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు ప్రజా సంపధను దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రజల సహకారంతో ఈ దాడులను తిప్పికొడతామన్నారు.
కాగా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులకు ఆ ప్రాంతంలో ఎటువంటి ఆనవాళ్ళు కనిపించక పోవడం గమనార్హం. మరొవైపు ఆ ప్రాంతంలోని ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అటు పోలీసులు, ఇటు మావోయిస్ట్‌ల కారణాలతో అడవిలో ఏంజరుగుతుందోనని భయపడుతూనే ఎవరు వెళ్లిన మాట్లాడేందుకు నిరాకరిస్తున్నారు.
చిత్రం..భద్రాచలం ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన మావోయిస్టుల మృతదేహాలు