రాష్ట్రీయం

21న అవిశ్వాసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 3: ప్రత్యేక హోదా కోసం పోరాటం క్లైమాక్స్ చేరుకుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈనెల 5న ఢిల్లీలో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తున్న నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గాల సమన్వయకర్తలకు జగన్ దిశానిర్ధేశం చేశారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం తాళ్ళూరు మండలం శివరాంపురం వద్ద జగన్‌తో వారు భేటీ అయ్యారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ ప్రత్యేకహోదా పోరాటం క్లైమాక్స్‌కు చేరిందని, దీంట్లో భాగంగానే ఈనెల 1న జిల్లాకలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశామని, 5న ఢిల్లీలో ధర్నా చేపడుతున్నామంటూ పోరాట ప్రణాళికను వివరించారు. ఈనెల 5నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతాయని, పార్టీ ఎంపీలు పోరాటం చేస్తారన్నారు. ఈనెల 20నాటికి ప్రత్యేకహోదా డిమాండ్ నెరవేరాల్సిందిగా పార్లమెంటులో ఆందోళన చేస్తామని, అర్ధిస్తామని, అందరికీ విజ్ఞప్తులు చేస్తామన్నారు. అప్పటికి ప్రత్యేకహోదా ఇవ్వకుంటే మార్చి 21న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. చంద్రబాబు పార్టనర్ పవన్ కళ్యాణ్ ఉద్దేశాలేంటో తనకు తెలియవని, అయినా ఆయనిచ్చిన సలహాను స్వీకరిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామన్నారు. కాని చంద్రబాబు మాత్రం పార్టనర్ సలహా ప్రకారం అవిశ్వాసానికి మద్దతివ్వకుంటే, చంద్రబాబు చిత్తశుద్ధి మరోసారి స్పష్టం అవుతోందని జగన్ విమర్శించారు. చంద్రబాబు వద్ద ఉన్న 20 ఎంపీలు అవిశ్వాసానికి మద్దతిచ్చేలా చూడాల్సిన బాధ్యత చంద్రబాబు పార్టనర్ పవన్‌కల్యాణ్‌పై ఉందన్నారు.
ప్రత్యేకహోదాపై పోరాటం విషయంలో ఎవరూ వైకాపాను వేలెత్తి చూపించడానికి వీలులేకుండా ఎన్డీయేపై అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని పార్టీ క్యాడర్‌కు జగన్ చెప్పారు. తమపార్టీకి చెందిన ఎంపీ వైవి సుబ్బారెడ్డి 184 నిబంధన కింద ప్రత్యేక హోదాపై లోక్‌సభలో చర్చకు యత్నిస్తున్నారని, దీంతోపాటు అవిశ్వాస తీర్మానం సందర్బంగా
వచ్చే చర్చ సమయంలోనూ మన గళాన్ని గట్టిగా వినిపించాలని జగన్ సూచించారు. ఏప్రిల్ 6న స్పీకర్ ఫార్మాట్లో ఉన్న ఆరుగురు ఎంపీలు లోక్‌సభకు రాజీనామా చేస్తారని జగన్ స్పష్టం చేశారు. ఎంపీలకు పార్టీనాయకత్వం, పార్టీశ్రేణులు అండగా ఉంటారని, ప్రజలు వారిని ఆదరిస్తారని జగన్ తెలిపారు. చిత్తశుద్దితో, నిజాయితీతో మనం పోరాటం చేస్తున్నామని, ప్రజలు కూడా మనపైనే నమ్మకం పెట్టుకున్నారని జగన్ వెల్లడించారు. ప్రత్యేకహోదాపై పోరాటం ఉద్ధృతంగా నడుస్తున్న సమయంలో ప్రజలను అయోమయానికి గురిచేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ మండిపడ్డారు. కేంద్రం నుండి వైదొలగడం చంద్రబాబు మొదటి అస్త్రం కావాలని, ఎంపీలతో రాజీనామా చేయించటం రెండో అస్త్రం కావాలని, కాని కేంద్రమంత్రి పదవులకు, తమ ఎంపీలకు రాజీనామా చేయడం చంద్రబాబు ఆఖరి అస్త్రంగా చెబుతున్నారంటే ప్రత్యేక హోదాపై ఆయనకున్న వైఖరి, అంతరార్ధం ఇట్టే తెలిసిపోతోందన్నారు. విభజన హామీల విషయంలోనూ మనకు రెండో ఆలోచన లేదని, చట్టంలో పేర్కొన్న ప్రకారం అప్పటి ప్రధాని ఇచ్చిన ప్రకటన ప్రకారం నూటికి నూరుశాతం హామీలను నెరవేర్చాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రత్యేకహోదా విషయంలో క్లైమాక్స్ పోరాటానికి సిద్ధమైన పార్టీనాయకులకు జగన్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా పార్టీ ఫిరాయించిన 22మంది శాసనసభ్యులపై అనర్హత వేటు వేసేవరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాబోమని జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు తాను కొనుగోలు చేసిన 22మంది శాసనసభ్యుల్లో నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టి ప్రజాస్వామ్యాన్ని మరింత అపహాస్యం చేశారని జగన్ మండిపడ్డారు.
వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రతిపక్షం గైరుహాజరు కావడటంతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుందని, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం పరిహాసం అవుతున్న తీరు, రాజ్యాంగ ఉల్లంఘనలపై మరోసారి గట్టి చర్చ జరుగుతుందన్నారు. ప్రతిపక్షానికి చెందిన 22మంది శాసనసభ్యులను చంద్రబాబు కొనుగోలు చేసిన వ్యవహరాన్ని పాదయాత్రలో ప్రజలకు వివరిస్తున్నామని, ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ప్రజలు ఎండగడుతున్నారని జగన్ పార్టీనాయకులకు వివరించారు. ప్రస్తుతం వైకాపాకు 44మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, వాస్తవంగా చంద్రబాబు రాజ్యసభకు పోటీపెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేలా చూడాల్సింది పోయి ఇప్పుడు మళ్ళీ ప్రలోభాలకు దిగుతున్నారని జగన్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు భారీగా ఆఫర్లు ఇస్తున్నారని, ఇంతకన్నా సిగ్గు చేటు ఏముంటుందని జగన్ ధ్వజమెత్తారు. కాని ఇప్పుడున్న శాసనసభ్యులు ఆ ఆఫర్లను తిరస్కంచి చిత్తశుద్ధితో, నిజాయితీగా వ్యవహరిస్తున్నారని, వారిపట్ల ఉన్న గౌరవం మరింత పెరిగిందని ప్రశంసించారు. ప్రతి విషయంలోనూ నిజాయితీగా ఉన్నామని, చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నామని, విలువలు, విశ్వసనీయతే వైకాపా సిద్ధాంతమని పార్టీ నాయకులకు జగన్ మరోసారి స్పష్టం చేశారు.
చిత్రం..పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశంలో జగన్