రాష్ట్రీయం

అన్యాయం వాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: రాష్ట్ర విభజన చట్టం అమలు నేపథ్యంలో ఏపీకి రావాల్సిన నిధుల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రకటనలు విరుద్ధంగా ఉన్నాయని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ఆరోపించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా కేంద్రం కేటాయించిన నిధుల అంశంపై ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ సంయుక్త కమిటీ నివేదికను ప్రజల ముందుంచిన సందర్భంగా ఆయన, మిగిలిన స్టీరింగ్ కమిటీ సభ్యులతో కలిసి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విరుద్ధమైన ప్రకటనలు చేస్తూ ప్రజలు గందరగోళానికి గురయ్యేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై స్పష్టమైన అవగాహన కోసం ప్రజల్లో ఉన్న అయోమయాన్ని తొలగించేందుకు అనుభవజ్ఞులైన వారితో జెఎఫ్‌సిని ఏర్పాటు చేశామన్నారు. నాయకులతోనే చర్చించి పునర్విభజన జరిగిన కారణంగా ప్రజలే ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రజల మాటకు విలువేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయినపుడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారని, విభజనతో అనేక సంస్థలు హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని, మనుషులను కదిలించగలం కానీ స్థిరాస్తులను కాదని ఇలాంటి సమస్యలను ఎలా పరిష్కరించాలనే అంశంపై చర్చించి విభజన చట్టంలో పేర్కొన్న కీలకమైన 11-15 అంశాలు కమిటీ ముందుకు వచ్చాయని అన్నారు. జనసేన ఆవిర్భావానికి ఒక విధంగా చెప్పాలంటే ప్రజలకు జరిగిన అన్యాయమేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. భారతీయ జనతా పార్టీ, తెలుగు దేశం పార్టీల
గెలుపునకు తాను కృషి చేశానని, తనపై నైతిక బాధ్యత ఉందని గుర్తించానని అన్నారు. వాళ్లు ఏం చేసినా బయటకు వెళ్లినపుడు బీజేపీ, టీడీపీ భాగస్వామి అంటారని, అందువల్ల తాను నైతికంగా సమాధానం చెప్పాల్సి వచ్చిందని అన్నారు. ఎన్‌డిఎ సమావేశంలో ఖచ్చితంగా విభజన హామీలను నెరవేరుస్తామని చెప్పారని, ఏపీకి 15 ఏళ్లు హోదా ఇస్తామని చెప్పారని, వాళ్లు చెప్పిన అన్ని అంశాలనూ తాను నమ్మానని, అందుకే ఆ పార్టీల విజయానికి తాను గట్టిగా మనస్ఫూర్తితో పనిచేశానని అన్నారు. ఇన్ని విరుద్ధ ప్రకటనలు చేస్తున్నపుడు మీరేం చేస్తున్నారని అంతా తనను నిలదీస్తున్నారని, చాలా మంది మేధావులు, అనువజ్ఞులు కలిస్తేనే అందరికీ అవగాహన కల్పించవచ్చని ఈ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు.విభజన చట్టంలో ప్రత్యక్షంగా తక్షణం అవసరమైన 11 అంశాలను జేఎఫ్‌సీ గుర్తించిందని, వాటిలో మొదటిది ప్రత్యేక హోదా అంశమని అన్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90 శాతం కేంద్ర నిధులు వస్తాయని, ఆ వివరాలు అన్నీ నిపుణులతో సేకరించామని అన్నారు. మొదటి వంద రోజులూ ఏవరినీ ఇబ్బంది పెట్టలేదని, వూరుకున్నామని, హోదా ఇస్తారని అందరిలా తానూ నమ్మానని అన్నారు. ఇంకా చేయకపోయే సరికి ప్రజల్లో అసంతృప్తి ఉందని, తిరుపతిలో మాట్లాడినపుడు అసలు ఇస్తారా లేదా ఆ ఉద్ధేశ్యం ఉందా అని అడిగానని వెంటనే కేంద్రం స్పందించిందని, కొద్ది రోజులు అయ్యాక కాకినాడ సభ పెట్టినపుడు హడావుడిగా అర్ధరాత్రి 12 గంటలకు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారని అన్నారు. కొండంత ఆశచూపించి పాచిపోయిన లడ్డూలను ఇచ్చారని, పాచిపోయిన లడ్డూలు అని తాను విమర్శిస్తే మాకవి ఇష్టమని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారని, ఈ రోజున అవే పాచిపోయిన లడ్డూలు కూడా సరిగా రాలేదని అన్నారు. అవి కూడా ఈ రోజుకీ ఇవ్వలేదని, రాష్ట్రం విభజించినపుడు తేనె రాసి వదిలేశారని, ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని, ప్రజలకు విపరీతంగా నష్టం జరుగుతోందని అన్నారు. దీంతో హోదా పరిస్థితి చూస్తుంటే ఉడుముకు ముఖం దగ్గర రాసిన తేనెలా అయిపోయిందని ఎద్దేవా చేశారు. సిఎం మాత్రం ఒక సారి హోదా గురించి, మరో మారు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారని, పాచిపోయిన లడ్డూలు అయినా పర్వాలేదు అని అన్నారని గుర్తు చేశారు. ఇపుడు మళ్లీ హోదా గురించి మాట్లాడుతున్నారని , ఇంత విరుద్ధ ప్రకటనలు ఎందుకు చేయాలని నిలదీశారు. ప్రజలకు మీరేం చేయాలో అది చేయడం లేదు, ఇలా ప్రజల్లో గందరగోళం సృష్టించి పదవులు పొందుతున్నారు, ప్రజలకు మాత్రం నష్టం జరుగుతోందని అన్నారు. ఇదెక్కడికి దారితీస్తుందనే భయం నాలో ఉందని, ఇచ్చిన హామీలను పరిష్కరించనపుడు ప్రజల్లో ఎలాంటి అశాంతి దారితీస్తుందో ప్రధాని అభ్యర్ధిగా నరేంద్రమోదీ ఉన్నపుడు గాంధీనగర్ వెళ్లి వివరించానని, కాని ప్రధాని పదవి చేపట్టిన తర్వాత మోదీకి వస్తున్న ఇబ్బంది ఏమిటో అర్ధం కావడం లేదని, ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియడం లేదని పవన్‌కళ్యాణ్ అన్నారు. పరిపాలనా అనుభవం ఉన్న నేతలే ఇంత గందరగోళంగా వ్యవహరిస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అని పవన్ నిలదీశారు. దీని ద్వారా ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుందో ఆలోచించాలని అన్నారు. దీనిని ముందుకు తీసుకువెళ్లకపోతే అనిశ్చితికి దారితీస్తుందని, దీనివల్ల రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు. అంతకు ముందు జరిగిన సమీక్షా సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు పద్మనాభయ్య, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్, తోట చంద్రశేఖర్, ఐవైఆర్ కృష్ణారావు, ఉండవల్లి అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. నివేదిక రూపకల్పనలో ప్రొఫెసర్ అమీర్ ఉల్లాఖాన్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ప్రొఫెసర్ ఆర్వీరామారావు, ఆలవిల్లి శ్రీనివాస్, తారా కృష్ణస్వామి, అరుణ , పేరి మహేశ్వర్, ప్రమోద్‌రెడ్డి, రాకేష్‌రెడ్డి తోడ్పడ్డారని కమిటీ పేర్కొంది.
పవన్‌కు అభినందనలు
కేంద్రం సాయంపై నివేదిక రూపొందించడానికి కృషి చేయడంపై పవన్‌కళ్యాణ్‌ను తాను అభినందిస్తున్నానని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్న విషయాల్లో ఖచ్చితంగా ఖండించాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయని అదన్నారు. కోర్టులు, ప్రభుత్వాలు మాదిరి సుదీర్ఘ సమయం తీసుకుని పరిశోధనలు చేసి తాము వివరించలేమని అన్నారు. ఈ నివేదిక పరిపూర్ణం కాదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి 74 వేల 542 కోట్ల రూపాయిలు రావల్సి ఉందని అన్నారు. ప్రత్యేక హోదాపై అనేక మాటలు మాట్లాడుతున్నారని , 11 రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా అమలులో ఉందని అన్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు.