రాష్ట్రీయం

పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం, రాష్ట్రం నాటకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన నాటకాలు ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చాయని ఏపీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్ర రావు అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాసిన బహిరంగ లేఖను శనివారం విలేఖరుల సమావేశంలో విడుదల చేశారు. పోలవరం నిర్మాణం విషయంలో అధికార పార్టీ స్వార్థపూరిత వైఖరివల్ల రాష్ట్రంపై అదనపు ఆర్థిక భారం పడడంతోపాటు, ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరిగి రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని తాను పలు లేఖల ద్వారా అప్రమత్తం చేశానని గుర్తుచేశారు. అధికార మత్తులో ఉన్న తమరు ఈ మాటలను పట్టించుకోలేదని, పైగా ప్రాజెక్టు నిర్మాణానికి తాను అడ్డుపడుతున్నట్లు ఆరోపణలు మోపారని ఆయన తెలిపారు. పోలవరం విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరి, కాంట్రాక్టుల కక్కుర్తితో ప్రాజెక్టు నిర్మాణాన్ని మీ చేతుల్లోకి తీసుకోవాలనే దుర్బుద్ధిని మొదటినుంచీ గమనిస్తున్నానని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకుంటున్న రాజకీయాలను పలు లేఖల ద్వారా ప్రజల దృష్టికి తెచ్చానని ఆయన వివరించారు. కాంట్రాక్టర్ల విషయంలో మీకు, కేంద్రానికి ఏర్పడిన విభేదాలవల్ల రాష్ట్ర ప్రజలకు మీపై అనుమానాలు బలపడి మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభించడంతో మీరు కేంద్రంనుంచి వచ్చిన నిధుల వివరాలతోపాటు, పోలవరం విషయంలో జరిగిన పరిణామాలను ప్రజల ముందు ఉంచక తప్పలేదని అన్నారు.
ఈ ప్రశ్నలకు బదులేదీ?
చంద్రబాబుకు కేవీపీ పలు ప్రశ్నలు సంధించారు. పీపీని అధికారులు పోలవరం ప్రాజెక్టు అంచనాలు ప్రస్తుత రేట్‌లకు సవరించి ఇవ్వాలని 2015 మార్చిలోనే అడిగినప్పుడు ఒక నెలలో ఇస్తామని చెప్పిన మీరు సెప్టెంబర్ 2016లో కేంద్రం ప్యాకేజీ ప్రకటించేంత వరకూ ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేశారు? కేంద్రం ఇచ్చిన ప్యాకేజీలో పోలవరం ప్రాజెక్టు ఖర్చును 2014 ఏప్రిల్ 1వ తేదీ రేట్ల ప్రకారమే నిధులు ఇస్తానని షరతు పెడితే, మీరు ఎందుకు అంగీకరించారు? ప్రాజెక్టు మీ చేతికి వచ్చి కాంట్రాక్టర్లు మీ చేతిలో ఉంటే చాలు అనే దురాశ వల్లే కదా? అని కేవీపీ ప్రశ్నించారు. ఇప్పటికైనా స్వార్థం విడిచి పెట్టి పోలవరం విషయంలో ప్రతిపైసా భరించాల్సిందేనని కేంద్రాన్ని లిఖితపూర్వకంగా కోరి అదే విషయాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో చెప్పి మీ పాపాలకు కొంతైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని కేవీపీ లేఖను ముగించారు.