రాష్ట్రీయం

ఏజెన్సీకి జ్వరమొచ్చింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారేడుమిల్లి, మార్చి 3: తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం లోతట్టు ఎగువ ప్రాంతమైన వైరామవరం మండలం కానివాడ పంచాయతీ పరిధిలోని మూడు గ్రామాల్లో ఎనిమిది మంది గిరిజనులు తీవ్రజ్వరంతో మృత్యువాత పడ్డ సంఘటన అలస్యంగా వెలుగులోనికి వచ్చింది. శనివారం ఈ సంఘటన సమాచారం అందిన వెంటనే రంపచోడవరం శాసనసభ్యురాలు వంతల రాజేశ్వరి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సమాచారం తెలియడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేసి వైద్య బృందాలను సంఘటన గ్రామాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసారు. వైరామవరం మండలం కానివాడ పంచాయతీ పరిధిలో ఊట్లబంద, పెదమళ్ల, గొప్పులతోటమామిడి గ్రామాల్లో అనేక మంది గిరిజనులు తీవ్రజ్వరాలతో సతమతమవుతున్నారు. గిరిజన గ్రామాలైన ఊట్లబందలో గత నెలలో పల్లాల పండురెడ్డి (50) పల్లాల బున్నమ్మ (39) పల్లాల తెల్లమ్మ (40) పల్లాల కొమ్మిరెడ్డి (70) పల్లాల చిన్నమ్మ (70)లు, పెద్దమళ్ల గ్రామంలో పల్లాల కురసారెడ్డి (40) పల్లాల పాప (2)లు, గొప్పుల తోట మామిడిలో పల్లాల కామేశ్వరరెడ్డి (45)లు తీవ్ర జ్వరంతో మృత్యువాత పడ్డారు. జనవరి 23న కానివాడ పంచాయతీ పరిధిలో జాజివలస గ్రామానికి ఏపి ఫైబర్ గ్రిడ్ ఆధ్వర్యంలో సమాచార వ్యవస్థ నెలకొల్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా గిరిజనులతో మాట్లాడి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్న సంఘటన విదితమే. ఇంత సమాచార వ్యవస్థ ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య సిబ్బంది మాత్రం ఏమాత్రం వినియోగించుకోకపోవడం, సంఘటన వివరాలు సంబంధిత అధికార యంత్రాంగానికి తెలియపరచకపోవడం విడ్డూరం. గతంలో చాపరాయి సంఘటనలో కేవలం సమాచార వ్యవస్థ లేకపోవడంతోనే 16 మంది మృత్యువాత పడిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
వైద్యాధికారిపై ఎమ్మెల్యే రాజేశ్వరి ఆగ్రహం
గిరిజనులకు వైద్యం పట్ల నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని రంపచోడవరం అదనపు జిల్లా వైద్యాధికారి కోసూరి అప్పారావుపై ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తేడు పీహెచ్‌సీ పరిధికి సమీపంగా ఉన్న సంబంధిత వైద్యాధికారి నాగేంద్ర ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. సమాచార వ్యవస్థను ఏర్పాటుచేసిన ఎందుకు వినియోగించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తపరిచారు. సంబంధిత ఏఎన్‌ఎమ్ తూతూ మంత్రంగా వచ్చి వెళ్లిపోతుందని, ఇలా అయితే ఏ విధంగా గిరిజనుల ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రశ్నించారు. తక్షణమే ఈ మూడు గ్రామ గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి గిరిజనులకు ఆరోగ్యం మెరుగపడేవరకు వైద్యం అందిచాలని ఆమె వైధ్యాధికారులకు ఆదేశించారు.
విషజ్వరాలు ప్రబలడం వల్లే..
ఊట్లబంద, పెద్దమళ్ల, గొప్పులతోటమామిడిల్లో గిరిజనులు విషజ్వరాలతో బాధపడుతున్నారని తక్షణమే వీరికి మూడు వైద్యబృందాలు ద్వారా చికిత్స అందిస్తున్నామని, రక్తపరీక్షలు చేసి రోగనిర్ధారణ చేసి తగిన వైద్యం అందిస్తామని వైద్యాధికారి అన్నారు. తీవ్రమైన జ్వరంతో భాదపడుతున్న వారిని రంపచోడవరం మారేడుమిల్లి ఆసుపత్రులకు తరలిస్తామని తెలిపారు.

చిత్రం..జ్వర బాధితులను పరామర్శిస్తున్న రంపచోడవరం ఎమ్మెల్యే వంతల