రాష్ట్రీయం

స్వచ్చంద సంస్థల సహకారంతోనే ప్రజలకు మెరుగైన వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 3: ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు స్వచ్చంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. శనివారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన టోమో థెరపీ వైద్య సేవలను ఆసుపత్రి సీఇఓ, ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి ప్రారంభించారు. క్యాన్సర్ రోగులకు బసవతారకం ఆసుపత్రి అందిస్తున్న సేవలు అద్బుతమని కొనియాడారు. క్యాన్సర్ వ్యాధి భారిన పడ్డ తన భార్య ఇబ్బందులు గమనించిన స్వర్గీయ ఎన్‌టీఆర్ ఇక్కడి రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్న సంకల్పం నుంచి ఈ ఆసుపత్రి అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వైద్య విధానంలో వస్తున్న అత్యాధునిక చికిత్స పద్దతులను ప్రవేశపెడుతూ ఇక్కడి రోగులకు నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో బసవతారకం ముందంజలో ఉండటం గర్వకారణమన్నారు. ప్రజలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి స్వచ్చంద సంస్థల సహాకం తోడైతే మరింత సమర్థవంతంగా చికిత్సలు అందించగలుగుతామని అన్నారు.త్వరలో అమరావతిలో క్యాన్సర్ ఆసుపత్రిని అందుబాటులోకి తేనున్నట్టు బాలకృష్ణ తెలిపారు. ఆసుపత్రి నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే 15 ఏకరాల స్థలాన్ని కేటాయించిందని చెప్పారు. ఒక్క సంవత్సరంలో నిర్మాణాలను పూర్తి చేసి సేవలు ప్రారంభిస్తామని తెలిపారు.

చిత్రం..బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో టోమో థెరపీ వైద్య సేవలను ప్రారంభిస్తున్న చంద్రబాబు