రాష్ట్రీయం

జమ్మూ కాశ్మీర్‌లో మహిళల పట్ల వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 3: రాజ్యాంగంలోని ఆర్టికల్ 35(ఏ) వల్ల జమ్మూకాశ్మీర్ మహిళలు పూర్తిగా వివక్షకు గురవుతున్నారని జమ్మూకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త నీరూ మిశ్రా అన్నారు. జమ్మూకాశ్మీర్ అధ్యయన కేంద్రం శనివారం రాత్రి విజయవాడలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో జమ్మూ కాశ్మీర్ మహిళలు.. ఆర్టికల్ 35(ఏ) అనే అంశం మీద ఆమె ప్రసంగించారు. సామాజికంగా, ఉద్యోగపరంగా కాశ్మీర్ రాష్ట్ర మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మహిళల ఆస్తి హక్కులను హరించి వేస్తున్న తీరును వివరించారు. కాశ్మీర్‌కి ఆవల వ్యక్తులను వివాహం చేసుకున్న మహిళను ఆ రాష్ట్ర పౌరురాలిగా పరిగణించపోవటాన్ని ఖండించారు. కాశ్మీర్ పౌరులు, ప్రత్యేకంగా హిందువులు, మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఒకదాని తర్వాత మరొకటి ఆమె వివరిస్తూ, ఆ అంశాల గురించి భారతదేశ ప్రజలందరూ ఆలోచించాలని, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35(ఏ)కి వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో భారతీయులందరూ పాల్గొని మద్దతు ఇవ్వాలని నీరూమిశ్రా కోరారు. అధ్యయన కేంద్రం కన్వీనర్ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వౌలిక వసతుల కల్పన సంస్థ చైర్మన్ ఆర్.లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.