రాష్ట్రీయం

పవన్ జేఎఫ్‌సీ లెక్కలు సరైనవే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 3: రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు సబబేనని, కాని నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలేదనే వ్యాఖ్యను ఖండిస్తున్నామని అన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయా రాష్ట్రాల కోసం చేయనంతగా ఆంధ్రప్రదేశ్ కోసం చేశారని, పవన్ కల్యాణ్ నేరుగా వచ్చి ఇబ్బందులు ఉన్నాయని చెప్పినప్పుడు ఆ సమస్యలు పరిష్కరించుకుంటూ టీడీపీ ప్రభుత్వం ముందుకు వెళ్లిందన్నారు. విభజన తర్వాత ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం విభజనకు సంబంధించి నాలుగు సంవత్సరాలుగా ఏ కార్యాచరణ తీసుకుంది అనేది సుస్పష్టమని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రెండేళ్లపాటు ఉద్యోగుల విభజన మొదలు ఎన్నో కష్టాలు తీరలేదని, విభజన సమయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సరైన పరిస్థితులు నెలకొల్పటంలో విఫలమయ్యాయని పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఇన్ని ప్రతిబంధకాల్లో కూడా 6వేల కోట్ల అదనపు భారం పడుతున్నా అదనపు పన్నులు వెయ్యకుండా వెయ్యి రూపాయలు పింఛను వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అన్నారు. పోలవరం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోటానికి 16 జాతీయ ప్రాజెక్టులు నడుస్తున్న తీరే కారణమని తెలిపారు. ఆ ప్రాజెక్టులకి 20 ఏళ్లలో వచ్చిన నిధులు, జరిగిన పని, పోలవరంతో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల కోట్లు ఖర్చుపెట్టి పని వేగంగా జరిగేలా చేసిందని, ఆ డబ్బుని కేంద్రం నుండి రాబట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నామని వివరించారు. భయం అనే పదం చంద్రబాబునాయుడు డిక్షనరీలోనే లేదని, 13 చార్జ్‌షీట్లు, ఈడీ అటాచ్‌మెంట్లు, మారిషస్ నోటీసులు తీసుకున్నవాళ్లు భయపడాలని వ్యాఖ్యానించారు. లోక్‌సత్తా జేపి నారాయణ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తూ 16,900 కోట్లు లోటు ఉందని, విద్యాసంస్థలకు 11వేల కోట్లు అవసరమని కానీ వచ్చింది 450 కోట్లేనని రాష్ట్ర ప్రభుత్వం బహిరంగపరచిందని గుర్తుచేశారు. దేశాన్ని పాలిస్తున్న ప్రభుత్వం హోదా ఇవ్వలేము అన్న తర్వాత రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకే ప్రత్యేక సహాయానికి అంగీకరించామన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు హోదా కొనసాగించారని, అందుకే హోదా డిమాండ్ చేస్తున్నామన్నారు. షెడ్యూల్ 9, 10 ఆస్తుల విషయంలో స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేస్తున్నామని, సుప్రీం కోర్టు చెప్పినా దానిపై సరైన స్పందన లేదని విమర్శించారు.