రాష్ట్రీయం

ఇన్నోవేటివ్ సెంటర్ ఏర్పాటుకు ఫిలిప్పీన్స్ శాస్తవ్రేత్తల బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, మార్చి 3: ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఇర్రి) డైరెక్టర్ జనరల్ మాథ్యూ మోరెల్ నేతృత్వంలోని శాస్తవ్రేత్తల బృందం శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాక మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి బృందం ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయిలాండ్ దేశాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఏపీలో రీజనల్ ఇన్నోవేటివ్ సెంటర్ (వినూత్న ఆవిష్కరణ కేంద్రం) ఏర్పాటుకు ఆ పర్యటనలో ఇర్రితో ఒప్పందం చేసుకున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఈ బృందం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమైంది. ప్రస్తుతం ఇలాంటి కేంద్రం ఉత్తర భారతదేశం వారణాసిలో ఉంది. దేశంలో రెండోదైన ఇన్నోవేటివ్ సెంటర్‌ను ఇర్రి భాగస్వామ్యంతో నెల్లూరు జిల్లాలో ఏర్పాటుచేసేందుకు ఉన్న అనుకూలమైన పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఇర్రి శాస్తవ్రేత్తల బృందం పర్యటించింది.
జిల్లా అధికారులతో సమావేశం
మాథ్యూ మోరెల్ నేతృత్వంలోని ఈ బృందం శనివారం నెల్లూరులో అధికారులతో సమావేశమైంది. ఏపీ ఐఐసీ చైర్మన్ పి కృష్ణయ్య, కలెక్టర్ ముత్యాలరాజు, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం వైస్ ఛాన్సలర్ వల్లభనేని దామోదర్‌నాయుడు, ఆర్డీవో పి హరిత, ఏపీ ఐఐసీ జెడ్ ఎం కె వెంకటేశ్వరరావు, డీడీ ఏ శివనారాయణ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇర్రి కార్యకలాపాలను శాస్తవ్రేత్తలు వివరించగా వరిసాగుతో పాటు నూతన ఆవిష్కరణలకు నెల్లూరులో ఉన్న విశిష్టతలను, వరితో నెల్లూరుకు ఉన్న అనుబంధాన్ని అధికారులు శాస్తవ్రేత్తలకు వివరించారు.
భూముల పరిశీలన
రీజనల్ ఇన్నోవేటివ్ సెంటర్ ఏర్పాటుకు అనుకూలమైన భూములను శాస్తవ్రేత్తల బృందం పరిశీలించింది. మొదట కోవూరు మండలం పోతిరెడ్డిపాళెంలోని భూములను పరిశీలించారు. ఇక్కడ ఉన్న అనుకూలతలపై అధికారులతో చర్చించారు. దగ్గరలో జాతీయ రహదారి ఉండటంతో పాటు నెల్లూరుకు ఆనుకుని వున్న ప్రదేశమని, పక్కనే పెన్నానది కూడా ఉందని అధికారులు వివరించారు. అనంతరం శాస్తవ్రేత్తల బృందం ముత్తుకూరు మండలం నారికేళపల్లి పంచాయతీ పరిధిలోని భూములను పరిశీలించారు. మొదట అక్కడ రైతులు సాగుచేసిన వేరుశనగ పంటను పరిశీలించి దిగుబడులపై చర్చించారు.
ఏఆర్‌ఎస్‌లో శాస్తవ్రేత్తల బృందం
భూముల పరిశీలన అనంతరం శాస్తవ్రేత్తల బృందం నెల్లూరులోని వ్యవసాయ పరిశోధన క్షేత్రం (ఏఆర్‌ఎస్)ను సందర్శించింది. రైస్ మ్యూజియంను సందర్శించడంతో పాటు ఏ ఆర్ ఎస్‌లో జరుగుతున్న అన్ని కార్యకలాపాలను స్థానిక శాస్తవ్రేత్తల నుంచి తెలుసుకున్నారు. నూతన వంగడాల ఆవిష్కరణల ప్రదర్శన క్షేత్రాలను పరిశీలించారు. నెల్లూరు శాస్తవ్రేత్తలు సృష్టిస్తున్న వంగడాల విశిష్టతను తెలుసుకున్నారు. అనంతరం ఇర్రి శాస్తవ్రేత్తలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ వల్లభనేని దామోదర్‌నాయుడు ఘనంగా సత్కరించారు.

చిత్రం..నెల్లూరులో వరి వంగడాలను పరిశీలిస్తున్న ఇర్రి సభ్యులు