రాష్ట్రీయం

థర్‌డ్రఫంట్ సారథ్యానికి రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ ప్రజల దీవెనలుంటే భారత దేశ రాజకీయాలకు అద్భుతమైన దిశా, దశా చూపించి దేశ ప్రజానీకానికి మార్గ నిర్దేశనం చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ‘నా ప్రయత్నంలో వందకు వందశాతం విజయం సాధిస్తానన్న సంపూర్ణమైన విశ్వాసం ఉంది’ అన్నారు. స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని 64 ఏళ్లపాటు పాలించిన కాంగ్రెస్, 11 ఏళ్లపాటు పాలించిన బీజేపీల నేతృత్వంలోని ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని కేసీఆర్ ఆరోపించారు. ఆ రెండు జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తృతీయ ఫ్రంట్ అవశ్యకతపై తానిచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకరావడానికి అవసరమైతే తృతీయ ఫ్రంట్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తూ ఆ పార్టీ శ్రేణులు, వివిధ ఉద్యోగ సంఘాలు, మత పెద్దలు
పెద్దఎత్తున ఆదివారం ప్రగతి భవన్‌కు తరలివచ్చారు. అలాగే వివిధ పార్టీల అధినేతలు మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ విషయాలను రాష్ట్ర ప్రజానీకానికి వివరిస్తూ సీఎం కేసీఆర్ భావోద్వేగ ప్రసంగం చేశారు. ‘తృతీయ ఫ్రంట్ అవశ్యకతపై నేనేదో ఆషామాషీగా, అవగాహన లేకుండా మాట్లాడటం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 2004లో ఢిల్లీకి వెళ్లి జాతీయ పార్టీలను కూడగట్టిన అనుభవం ఉంది. పంచవర్ష ప్రణాళికలపై అవగాహన, సుదీర్ఘమైన రాజకీయ అనుభవ నేపథ్యం నాకు ఉన్నాయ’ అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు దాటినా ఇంకా రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. దీనికి కారణం ఇంతకాలంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీల వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు. అన్నింటికీ ధరలు పెరుగుతాయి. మరీ రైతులు పండించిన పంటలకు ధరలెందుకు పెరగటం లేదని గట్టిగా నిలదీశారు. దేశమంటే ప్రజలు, కులాలు, మతాలు కాదన్నారు. ఇనే్నళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా పేదలు, సామాన్య ప్రజలకు కానీ రైతులకు కానీ ఏమైనా మేలు జరిగిందా? అలాంటప్పుడు ఈ జీడీపీలు, గీడీపీలు ఎందుకని ప్రశ్నించారు. పరిశ్రమలకు, వివిధ రంగాలకు రాయితీలిస్తున్న కేంద్రం, అలాంటి రాయితీలు రైతులకు ఎందుకు ఇవ్వదని నిలదీశారు. దేశంలో సహకార సమాఖ్య వ్యవస్థ పేరుకే కానీ పెత్తనమంతా ఢిల్లీ చేతిలోనే ఉంచుకుందన్నారు. ప్రధాన మంత్రి గ్రామీణ్ సడక్ యోజనేంటీ? ఆ పనిని రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోలేవా? అని కేసీఆర్ ప్రశ్నించారు. చివరికి ఉపాధి కూలీల డబ్బులనూ కేంద్రం ఢిల్లీలో పోస్టు డబ్బాలో వేసే దుస్థితి ఏర్పడిందన్నారు. అన్నీ ఢిల్లీ పెత్తనం చేతిలో ఉంటే ఇక సర్పంచ్‌లు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని సీఎం కేసీఆర్ నిలదీసారు. భారత్‌కంటే వెనుకబడిన దేశాలు కూడా అనతికాలంలోనే అగ్రరాజ్యం అమెరికాకు ధీటుగా అభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. అమెరికా, జర్మనీ, చైనా, సింగపూర్ వంటి దేశాలు శరవేగంగా అభివృద్ధిలో దూసుకపోతుంటే ఆ స్థాయిలో భారత్ ఎదగకపోవడానికి ఇంతకాలం అధికారంలో ఉన్న పార్టీల వైఫల్యం కారణం కాదా? అని ప్రశ్నించారు. భారత్ ఎదగకపోవడానికి ఇక్కడి రాజ్యాంగమే అడ్డంకిగా మారిందంటారు.. అలాంటప్పుడు రాజ్యాంగాన్ని మార్చుకుంటే తప్పేంటని కేసీఆర్ ప్రశ్నించారు. చిత్తశుద్ధి, కార్యదక్షత ఉంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ‘కేసీఆర్‌ను జైలుకు పంపుతారని కొందరు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎందుకు పంపుతారు. కేసీఆర్‌కు తోక, తొండం ఏమీ లేదు. ఏ తప్పు చేయలేదు. ఎవరికీ భయపడాల్సిన పని లేదు. ఇలాంటి వాటికే భయపడే వాడినే అయితే తెలంగాణ సాధించేవాడినా? నన్ను ముట్టుకుంటే భస్మం అవుతారు, తస్మాత్ జాగ్రత్త’ అంటూ సీఎం కేసీఆర్ విపక్షాలకు హెచ్చరిక చేశారు.
*
చిత్రం..థర్డ్‌ఫ్రంట్ ప్రకటనకు మద్దతు ప్రకటిస్తూ ఆదివారం ప్రగతిభవన్‌కు చేరుకున్న అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
*
కేసీయారేసేనులే
వేసారిన వారికొరకు వీనుల విందౌ
ఊసుల పాచిక ఆశల
మోసులు తొడగంగ ఫ్రంటు మొదలయ్యెనుగా!