రాష్ట్రీయం

జాతి విద్రోహుల మాయా యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జెఎన్‌యు పరిణామాలతో బట్టబయలు
* ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ
హైదరాబాద్: దేశద్రోహుల భరతం ప్రజలే పట్టాలని ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీ పిలుపు ఇచ్చారు. ‘విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలు-సమాజంపై దాని ప్రభావం’ అన్న అంశంపై హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జి రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో శనివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. ‘విశ్వవిద్యాలయాల పరిరక్షణ వేదిక’ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాట్లాడుతూ, ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించి, పడగొట్టడానికి క్షుద్ర రాజకీయ, జాతివ్యతిరేక శక్తులు ఏకమై భయానక కుట్రకు పాల్పడ్డాయన్నారు. రోజుకో అంశాన్ని కెలికి పెనువివాదంగా మార్చటం ప్రజావ్యతిరేక, జాతి విద్రోహశక్తుల మాయాయుద్ధంలో భాగమన్నది ప్రజలు గ్రహించాలన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంతో లీలగా వ్యక్తమైన జాతివిద్రోహుల ప్రమేయం, ఢిల్లీ జెఎన్‌యు పరిణామాలతో బట్టబయలైందన్నారు.
దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలు అసాంఘిక శక్తులకు ఆలవాలమైనవని శాస్ర్తీ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా విశ్వవిద్యాలయాలు, సాంస్కృతిక సంస్థలను వామపక్షాలకు వదిలివేశారని, ఇందిర-వామపక్షాల మధ్య లోపాయికారీగా కుదిరిన ఒప్పందం మేరకే ఈ నిర్ణయం జరిగిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో అసాంఘిక శక్తులు పెట్రేగిపోవడం కేవలం బిజెపి సమస్యనో, కేంద్రం సమస్యనో కాదని, ఇది యావత్ భారతదేశ సమస్య అన్నారు.
హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి మరణాన్ని రాజకీయ లబ్దికోసం ఉపయోగించుకోవాలని, కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ తదితరులు ప్రయత్నించారన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏం జరిగిందో విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. తీవ్రవాదులు అఫ్జల్ గురు, మఖ్‌బూల్‌బట్‌లను న్యాయస్థానపరంగా చంపారని నిరసిస్తూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు) లో జాతివ్యతిరేక శక్తులు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం శోచనీయమన్నారు. జెఎన్‌యులో సంఘటనలకు హఫీజ్ సరుూద్ (26/11 ముంబాయి దాడులకు సూత్రదారి) మద్ధతు తెలపడం గమనార్హమన్నారు. భావస్వేచ్ఛాప్రకటన అంటే పాకిస్తాన్‌ను కీర్తించడమో, టెర్రరిస్టులను వెనకేసుకురావడమో కాదని ఎంవిఆర్ శాస్ర్తీ పేర్కొన్నారు. పాకిస్తాన్, ఐఎస్‌ఐ, లష్కర్ తొయిబా తదితరుల వల్ల మనదేశంలో ఇప్పుడు యుద్ధాన్ని తలపించే వాతావరణ నెలకొని ఉందని, అంతర్యుద్ధం (సివిల్ వార్) తరహా పరిస్థితి ఏర్పడి ఉందన్నారు. జెఎన్‌యులో భారత్ డౌన్ డౌన్ అన్నట్టే పాకిస్తాన్‌లో పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటే ఉరితీస్తారని గుర్తు చేశారు.
విశ్వవిద్యాలయాలు విద్యకు మాత్రమే కేంద్రాలుగా పరిఢవిల్లాలని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ బి. సత్యనారాయణ అన్నారు. 1980 తర్వాత విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి దిగజారిపోతోందన్నారు. విశ్వవిద్యాలయాల్లో రాజకీయ నాయకుల జోక్యం పెరిగిపోతోందని, విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల విశ్వవిద్యాలయాల్లోకి రాజకీయనాయకులు రావద్దని, బోధన, బోధనేతర సిబ్బంది ఖాళీపోస్టులను భర్తీ చేయాలని, కేంద్రం నుండి రావలసిన నిధులను త్వరగా వచ్చేలా చూడాలని ఆయన కోరారు.
దేశభద్రత విషయంలో కాంప్రమైజ్ కావద్దని, రాజ్యాంగానికి లోబడి విశ్వవిద్యాలయాలు పనిచేసేలా చూడాలని ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వైస్-్ఛన్సలర్ ప్రొఫెసర్ తిరుపతిరావు పేర్కొన్నారు.
దేశనిర్మాణం తరగతి గదుల నుండే ప్రారంభం కావాలంటూ కొఠారి కమిషన్ అభిప్రాయపడ్డదని, విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి విద్య లభిస్తే, అదేస్థాయిలో దేశం అభివృద్ధిపథంవైపు ముందడుగు వేస్తుందని డాక్టర్ డి. మనోహర్‌రావు (ప్రొఫెసర్ ఆఫ్ జెనెటిక్స్-రిటైర్డ్) పేర్కొన్నారు. విశ్వవిద్యాలయాల్లో ‘బీఫ్ ఫెస్టివల్’, ‘ముద్దుల పండగ’, ‘కల్లులొట్లపండగ’, ‘డ్రింక్స్‌ఫెస్టివల్’ తదితరాలు అవసరమా అంటూ ప్రశ్నించారు. అసాంఘిక శక్తుల అట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ విష్ణువర్దన్‌రెడ్డి, ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ ఎపి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ బుచ్చారెడ్డి, ప్రొఫెసర్ విశ్వమోహన్, ప్రొఫెసర్ ఎ. నాగభూషణం తదితరులు మాట్లాడారు.

చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న ఆంధ్రభూమి సంపాదకులు ఎంవిఆర్ శాస్ర్తీతో పాటు ఓయు టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ ప్రొఫెసర్ మనోహర్‌రావు, మాజీ వైస్-్ఛన్సలర్ తిరుపతిరావు ఉన్నారు.