రాష్ట్రీయం

ఇంటింటికీ పలకరింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 4: రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రగా తీర్చిదిద్దడంతో పాటు దేశంలోనే వైద్య రంగానికి రోల్‌మోడల్‌గా రూపుదిద్దటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా ఉండవల్లిలోని గ్రీవెన్స్ సెల్ హాల్‌లో ఏర్పాటు చేసిన రాష్ట్ర, జిల్లా, గ్రామీణ స్థాయి ఆరోగ్య బులెటిన్‌ను ఆవిష్కరించి, చిన్నారుల ఆరోగ్యం కోసం ‘పలకరింపు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమావేశానికి హాజరైన ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, మెప్మా కార్యకర్తలతో మాట్లాడుతూ మార్చి 5నుంచి 31వరకు 21 రోజుల పాటు పలకరింపు గ్రామాల్లో కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలోని 1.2 కోట్ల ఇళ్లను సందర్శించి 50లక్షల మంది చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు 57,555 బృందాలు పనిచేస్తాయన్నారు. రాష్టస్థ్రాయి నుంచి జిల్లా, గ్రామస్థాయి వరకు 42,219 ఆశా వర్కర్లు, 51,545 అంగన్‌వాడీలు, లక్ష మంది మెప్మా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రతి వ్యక్తి ఆరోగ్యం కోసం అవగాహన కల్పిస్తారన్నారు. పిల్లల్లో పుట్టుకతో వచ్చిన లోపాలను గుర్తించి తగిన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటారన్నారు. రాబోయే కాలంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యం కోసం ఎన్నో వైద్య కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చంద్రబాబు చెప్పారు. ప్రతి వ్యక్తి ఆరోగ్య సంబంధ వివరాలను డిజిటల్ రూపంలో ఉంచటంతో పాటు ఆధార్‌తో అనుసంధానం చేయటం వల్ల భవిష్యత్‌లో వారి ప్రొఫైల్ డాక్టర్లకు అందుబాటులోకి వుండి ఆయా వ్యక్తులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఇప్పటికే 13 జిల్లాల్లోని ప్రధాన ఆరోగ్య సమస్యలపై విశే్లషణాత్మక నివేదికను రూపొందించామని తెలిపారు.
గర్భిణులకు సీమంతాలు, పిల్లలకు బారసాలు ప్రభుత్వపరంగా నిర్వహిస్తూ పౌష్టికాహారం అందుబాటులోకి తెచ్చి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుతున్నామన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గుండెజబ్బుల ఇబ్బందులు ప్రజలకు ఎక్కువగా వస్తున్నాయన్నారు. చిత్తూరు, ఒంగోలు, కర్నూలులో ఆర్థరైటీస్ ఇబ్బందులు, నెల్లూరులో ప్రజలకు ఆస్తమా ఇబ్బందులు, కడపలో హైపర్ టెన్షన్‌తో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య ఇబ్బందులు తలెత్తకుండా చూడటంతో పాటు, సమస్యలు తెలుసుకుని నివారణకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజారోగ్యానికి 26 కొత్త పథకాలను మూడున్నరేళ్లలో తెచ్చామన్నారు.

చిత్రం..‘పలకరింపు’ పోస్టర్ ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు, ఆరోగ్య మంత్రి శ్రీనివాస్