రాష్ట్రీయం

స్టేట్ హీరో.. కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయబోయే తృతీయ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన తో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయ. కేసీఆర్ జాతీయ రాజకీయాలను టార్గెట్ చేస్తే, రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు వారసుడు ఎవరన్న చర్చకు తెరలేచింది. కేసీఆర్ దూకుడు చూస్తుంటే, వచ్చే ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం ఖాయంగానే కనిపిస్తుంది. తరువాత రాష్ట్రంలో తన రాజకీయ వారసత్వాన్ని తనయుడు, మంత్రి కేటీఆర్‌కు అప్పగించనున్నారని ఇంతకాలంగా సాగిన ఉహాగానాలకు కేసీఆర్ ప్రస్తుత ప్రకటనతో బలం చేకూర్చినట్టయ్యంది. సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో ఆదివారం పెద్ద ఎత్తున ప్రగతి భవన్‌కు తరలివచ్చిన తెరాస శ్రేణులు ‘కాబోయే పీఎం కేసీఆర్’, ‘దేశ్ కా నేతా కేసీఆర్’ అన్న నినాదాలతో పాటు బ్యానర్లూ ప్రదర్శించారు. ఎల్బీ నగర్‌కు చెందిన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ అనుచరులు మరో అడుగు ముందుకేసి సీఎం ప్రసింగించిన సమావేశంలోనే కేటీఆర్ ఫోటోతో ముద్రించిన ‘కేటీఆర్ జిందాబాద్’ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే తదుపరి పార్టీ పగ్గాలు, కేసీఆర్ రాజకీయ వారసత్వం కేటీఆర్‌దేనన్న పరోక్ష సంకేతాలను ఈ బ్యానర్లు ఊతమిచ్చాయ. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషించడానికి సన్నద్ధమవుతున్న కేసీఆర్ రాజకీయ వారసత్వంపై తెరాస ఇంటా, బయటా పెద్దఎత్తున చర్చ మొదలైంది.