రాష్ట్రీయం

బండారం బయటపెడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బోధన్, మార్చి 4: సీఎం కేసీఆర్ మోసాలను వివరించి ప్రజలను చైతన్యపర్చేందుకే ప్రజాచైతన్య యాత్ర చేపట్టామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన తెరాస అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజమెత్తారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ తెరాస పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, ఒక్క రైతునూ సీఎం పరామర్శించలేక పోయారని ఎద్దేవా చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించి, కొనుగోళ్లు చేపట్టడంలో సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికల సమయంలో సాధ్యంకాని హామీలిచ్చి, అవి నెరవేర్చలేక కాంగ్రెస్‌పై విమర్శలతో కాలం వెళ్లదీస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటైతే వంద రోజుల్లో నిజాం చక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం తెస్తామని చెప్పిన కేసీఆర్, ఏకంగా మిల్లునే మూసేశారని విమర్శించారు. సమస్యపై శాసనసభలో నిలదీస్తే స్పష్టత ఇవ్వకుండా దాట వేస్తున్నారని ఆగ్రహించారు. మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్‌లు ఇస్తామని చెప్పి నేడు పూర్తిగా మైనార్టీలను విస్మరిస్తున్నారని, వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలిస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు. తెరాస హయాంలో కేవలం మద్యం అమ్మకాలు, అప్పుల విషయంలోనే రాష్ట్రం నెంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఇన్నాళ్ల్లూ రైతుల పంటలు, కొనుగోలు కేంద్రాలు, గిట్టుబాటు ధరల గురించి పట్టించుకోని సర్కారు నేడు వచ్చే ఖరీఫ్ నుంచి ఎకరాకు ఖర్చుల నిమిత్తం నాలుగు వేలు రైతుల ఖాతాలో వేస్తామనే పథకాన్ని తీసుకువచ్చిందని ఉత్తమ్ విమర్శించారు. కేవలం ఎన్నికలలో రైతుల ఓట్ల కోసమే పథకాన్ని తెరపైకి తెచ్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుకు అన్ని విధాలుగా న్యాయం చేస్తామన్నారు. వరి, మొక్కజొన్న, సజ్జలకు క్వింటాల్‌కు 2వేలకంటే తగ్గకుండా మద్దతు ధర ఇస్తామని, పత్తికి 6వేలు, మిర్చి, పసుపుకు 10వేలు, సోయాకు 3500 రూపాయల మద్దతు ధర ఇస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ
చేస్తామన్నారు. అలాగే రైతుల పంటలకు చేసే బీమా సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తుందని, డ్వాక్రా సంఘాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక్కో సంఘానికి లక్ష రూపాయల రివాల్వింగ్ ఫండ్‌నిస్తూ పదిలక్షల రూపాయల బ్యాంకు లోను వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. అభయహస్తాన్ని పునరుద్ధరిస్తూ సెర్ఫ్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామన్నారు. చదువుకున్న విద్యార్థులకు లక్ష ఉద్యోగాలిస్తూ నిరుద్యోగులకు ప్రతి నెలా మూడు వేల రూపాయల నిరుద్యగ భృతిని కూడా చెల్లిస్తామన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వందశాతం ఫీజు రీయంబర్స్‌మెంట్ ఇస్తామని, మైనార్టీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. నిజాంచక్కెర కర్మాగారాన్ని తిరిగి పునరుద్ధరించి కార్మికులను ఆదుకుంటామని, చెరకు రైతులకు న్యాయం చేస్తామన్నారు. సభలో సిఎల్పీ నాయకుడు జానారెడ్డి, శాసనమండలి నాయకుడు షబ్బీర్‌అలీ, ఏఐసిసి కార్యదర్శి హనుమంతరావు, రాష్ట్ర, జిల్లాల నేతలు పాల్గొన్నారు.
చిత్రం..బోధన్ బహిరంగ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్, కాంగ్రెస్ నేతలు