రాష్ట్రీయం

తెలంగాణలో 95% మాంసాహారులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: తెలంగాణ ప్రజల్లో 95 శాతం మంది మాంసాహారులేనని ఒక సర్వేలో వెల్లడైంది. అందుకే కాబోలు..తెలంగాణ ప్రభుత్వం కూడా కోళ్లు, గొర్రెలు, మేకలు, చేపలు, రొయ్యలు తదితరాల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. సబ్సిడీలు ఇస్తూ వీటి పెంపకానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. తెలంగాణలో ప్రజల ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ప్రొఫెసర్ జయశంక్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇటీవల ఒక సర్వే నిర్వహించింది. యూనివర్సిటీ విద్యార్థులు అనేక గ్రామాలు, పట్టణాల్లోని ఇళ్లకు వెళ్లి ప్రజలతో చర్చించారు. ఆహార అలవాట్లపై రూపొందించిన ప్రణాళికకు అనుగుణంగా అభిప్రాయ సేకరణ చేశారు. కులాలు, మతాలకు అతీతంగా, పేద, ధనిక అన్న తేడా లేకుండా అందరితో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆదేశాలమేరకే సర్వే నిర్వహించారని తెలిసింది. రాష్ట్రంలో 95 శాతం మంది మాంసాహారులేనని సర్వే లో తేలింది. సర్వే వివరాలు ఇలా ఉన్నాయి. మాంసం తలసరి నెలవారీ వినియోగం 1.40 కిలోలని తేలింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక వ్యక్తి సగటున నెలకు 12.50 కిలోల బియ్యం, ఇతర ఆహార ధాన్యాలు వినియోగిస్తున్నారు. కేవలం బియ్యం తీసుకుంటే 9.50 కిలోలు సగటున ఒక్కొక్కరు వినియోగిస్తున్నారు. ఆహార ధాన్యాల వాడకంలో నాగర్‌కర్నూలు, యాదాద్రి భవనగిరి జిల్లాలు 17.50 కిలోలతో టాప్‌లో నిలిచాయి. పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న మెదక్, మంచిర్యాల, హైదరాబాద్ జిల్లా ల్లో ఆహార ధాన్యాల వాడకం తక్కువగా అంటే 11 కిలోలు మాత్రమే ఉంది. వివిధ పప్పుల వినియోగం నెలకు సగటున 1.75 కిలోలు కాగా, ఇందులో కందిపప్పు ఎక్కువగా వాడుతున్నారు. వంటనూనెల వినియోగం తలసరి నెలకు 1.22 లీటర్లుగా ఉన్నట్టు తేలింది. పొద్దుతిరుగుడు పువ్వు నూనె ఎక్కువగా వాడుతున్నారు. మసాలాల వాడకం నెలకు తలసరి 635 గ్రాములుగా ఉంటుందని స్పష్టమైంది. చింతపండు, ఎండుమిర్చి, అల్లం మసాలాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) సర్వే ప్రకారం జాతీయ స్థాయిలో ఉప్పు వినియోగం 0.25 కిలోలు కాగా, తెలంగాణలో ఉప్పు వినియోగం దీనికి రెండున్నర రెట్లు ఎక్కువగా అంటే 0.64 కిలోలుగా ఉన్నట్టు తేలింది. పట్టణ ప్రాంతాల్లో తలసరి నెలవారీగా ఆహారం కోసం జరుగుతున్న ఖర్చు 2309 రూపాయలని తేలింది. గ్రామాల్లో ఇది 1942 రూపాయలుగా తేలింది.
పంటల ప్రణాళికకు ఉపయోగం
వ్యవసాయ విశ్వవిద్యాలయం చేసిన సర్వే వ్యవసాయ పంటల ప్రణాళికను ఉపయోగపడుతుందని స్పష్టమైంది. ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా పంటల కాలనీలను చేపట్టబోతోంది. అంటే ఏ గ్రామంలో ఏ రైతు ఏ పంట వేయాలో నిర్ణయిస్తారు. ఒకేసారి ఒక పంట ఎక్కువగా, మరో పంట తక్కువగా ఉండకుండా చూడాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తేలింది.

తెలంగాణలో వార్షిక ఆహార
వినియోగం (లక్షల టన్నుల్లో)
బియ్యం 42.63
గోధుమ పిండి 4.48
మొక్కజొన్న 0.36
కందిపప్పు 3.13
పెసరపప్పు 1.44
మినపపప్పు 1.34
పొద్దుతిరుగుడు నూనె 3.65
వేరుసెనగనూనె 0.85
ఆలుగడ్డ 2.28
ఉల్లిగడ్డ 4.68
టమాట 4.89
పచ్చిమిర్చి 2.00
ఎండుమిర్చి 0.44
పసుపు 0.23
చింతపండు 0.62
అల్లం 0.64
అరటి 2.73
పాలు 20.26
పెరుగు 3.38
చక్కెర 3.45
కోడిమాంసం 2.43
మేకమాంసం 1.36