రాష్ట్రీయం

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు మద్దతిస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 4: దేశ రాజకీయాల్లో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కావాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటనకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆదివారం నాడిక్కడ పవన్ మీడియాతో మాట్లాడుతూ థర్డ్ ఫ్రంట్ అనేది కచ్చితంగా ఉండాలని జనసేన కోరుకుంటోందని తెలిపారు. భారత దేశం, తెలంగాణ సమాజం, సమస్యల పట్ల చాలా బలమైన, లోతైన అవగాహన ఉన్న వ్యక్తి కెసిఆర్ అని పవన్ పేర్కొన్నారు. అటువంటి నాయకుడు థర్డ్ ఫ్రంట్‌కు నాయకత్వం వహిస్తానంటే సాటి తెలుగువాడిగా స్వాగతిస్తానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని కెసిఆర్ చెప్పినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజలపై ఆయనకున్న ప్రేమాభిమానాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని, తెలుగు వారు ఎక్కడున్నా ఒక్కటే అనేందుకు ఈ వ్యాఖ్యలే నిదర్శనమని కొనియాడారు. జాతీయ పార్టీల వల్లే ప్రాంతీయ పార్టీలు పుట్టుకు వస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రం ప్రభుత్వం అన్ని హామీలను నెరవేర్చి ఉంటే జనసేన పార్టీ పుట్టేది కాదని అన్నారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను అర్ధం చేసుకోకపోతే థర్డ్ ఫ్రంట్ తప్పకుండా పుడుతుందని అన్నారు.