రాష్ట్రీయం

గిన్నిస్ రికార్డుకు చేరువలో ఏపీ నంది నాటకోత్సవాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, మార్చి 4: గుంటూరు జిల్లా తెనాలిలోని తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో నెల రోజులుగా జరుగుతున్న నంది నాటకోత్సవాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో నమోదుకు అర్హత సాధించేందుకు చేరువవుతున్నాయని కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడు, ఏపీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) గౌరవాధ్యక్షుడు దిలీప్‌రాజా తెలిపారు. ఆదివారం ‘మా’ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ తెనాలిలో ఇప్పటికే 140 నాటకాలు ప్రదర్శించారని, తరువాత కాకినాడ, రాజమండ్రిలో నాటకోత్సవాలు కొనసాగుతాయని చెప్పారు. నంది నాటకోత్సవాల్లో మొత్తంగా 380 నాటకాలు 82 రోజులపాటు ప్రదర్శితవౌతాయని, దేశంలోని ఏ రాష్ట్రంలో, ఏ భాషలోనూ ఇప్పటివరకు ఇన్ని నాటకాలు ఇన్ని రోజుల పాటు ప్రదర్శించలేదని పేర్కొన్నారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సు రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేయగా ప్రపంచంలోనే ఈ మాదిరి నాటక పోటీలు ఎక్కడా నిర్వహించలేదని కూడా వెల్లడైందన్నారు. అయితే నంది నాటకోత్సవాలను ఏపీ ప్రభుత్వం ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ద్వారా నిర్వహిస్తున్నందున రికార్డు నమోదుకు ప్రభుత్వమే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి ప్రతిపాదన పంపవలసి ఉందన్నారు. ఎఫ్‌డీసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడమే నంది నాటకోత్సవాలను రికార్డు స్థాయికి తీసుకెళ్లటానికి కారణమని దిలీప్‌రాజా ప్రశంసించారు. అంతరించిపోయే దశను అధిగమించి నేడు నాటకోత్సవాలు ఎఫ్‌డీసీ ద్వారా సజీవంగా కొనసాగుతున్నాయన్నారు. తెనాలి వస్తున్న ప్రేక్షకులు, అభిమానులు కుర్చీలు ఖాళీ లేక కొన్ని నాటకాలను నేలపై కూర్చొని చూస్తున్నారని తమ దృష్టికి వచ్చిందంటూ కళాప్రియులను ఆయన అభినందించారు. కళాకారులకు థియేటర్ దగ్గరకే భోజనాలు పంపుతున్నారంటే నంది నాటకోత్సవాలను ఎఫ్‌డీసీ వారు ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారో అర్థమవుతుందన్నారు. నాటక సమాజాలు విధివిధానాల్లో మార్పులు కోరుకుంటే జరగబోయే నంది నాటకోత్సవాలకు ముందుగానే ఎఫ్‌డీసీతో చర్చించాల్సిందిగా దిలీప్‌రాజా సూచించారు. గతంలో స్క్రూటినీ జరిగేదని, దానివల్ల కొన్ని పెద్ద నాటక సమాజాలకు మాత్రమే ప్రదర్శనలకు అవకాశం దక్కేదన్నారు. ప్రస్తుతం ఒకసారి ప్రదర్శించిన ఏ నాటకానికైనా నంది నాటకోత్సవ పోటీల్లో పాల్గొనే అవకాశం కల్పించటం శుభ పరిణామమన్నారు. నంది నాటకోత్సవాల స్థాయిని గిన్నిస్ బుక్ స్థాయికి చేర్చిన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డు సభ్యుడిగా తాను అభినందనలు తెలుపుతున్నట్లు దిలీప్‌రాజా వివరించారు. విలేఖరుల సమావేశంలో నటి టీనాచౌదరి, సత్యనారాయణ చౌదరి, షేక్ షబ్బీర్, సలాం, పినపాటి సురేష్‌బాబు పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న దిలీప్‌రాజా