రాష్ట్రీయం

వేములవాడలో వైభవోపేతంగా పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ, మార్చి 4: తెలంగాణ మాగాణంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో భక్తజన రంజకమై, భూకైలాసమై వెలుగొందుతున్న శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల దివ్యకల్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అభిజిత్‌లగ్న సుముహూర్తాన ఆదివారం ఉదయం 10.30గంటలకు కల్యాణాన్ని అర్చకులు ప్రారంభించారు. పార్వతీదేవి నొసటన కల్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్కను పెట్టుకొని ఆలయ అధికారులు సమర్పించిన పట్టువస్త్రాలను ధరించి పార్వతీదేవి పెళ్లికూతురిలా అలంకృతులయ్యారు. కల్యాణ ఘడియ కోసం భక్తులు ఒళ్ళంతా కళ్లుచేసుకొని ఎదురుచూశారు. అనుకున్న సమయం రానే వచ్చింది. భక్తుల జయజయధ్వానాల మధ్య అభిజిత్‌లగ్నంలో శ్రీ పార్వతీదేవిని శ్రీ రాజరాజేశ్వరస్వామి వైభవోపేతంగా పరిణయమాడారు. ఒకవైపు స్వామివారి దివ్యకల్యాణం జరుగుతుండగానే మరోవైపు శివపార్వతులు నెత్తిపై జీలకర్ర బెల్లం పెట్టుకొని శూలాలు ఊపుతూ శివుడిని వివాహం చేసుకున్నారు. ఉత్సవమూర్తులపై తలంబ్రాలు పడుతుంటే భక్తులు కూడా తమ శిరస్సులపై అక్షింతలను చల్లుకున్నారు. యాభైవేలకు పైగా భక్తులు, శివపార్వతులు దివ్యకల్యాణాన్ని తిలకించారు. అర్చకులు ప్రతాప శ్రీనివాస్ రాజేశ్వరి దంపతులు కన్యాదాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇవో రాజేశ్వర్, నగర పంచాయతీ వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, ఏఏంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు.

చిత్రం..వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో వైభవోపేతంగా జరిగిన శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కల్యాణం