రాష్ట్రీయం

దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, మార్చి 5: దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయం అవసరం ఉందని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆరే సరైనోడని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. సోమవారం వరంగల్ సర్క్యూట్ గెస్టు హౌస్‌లో విలేఖరులతో మాట్లాడుతూ దేశ రాజకీయాలను నిశితంగా పరిశీలించిన కేసీఆర్ దేశ సమగ్రత, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకువచ్చారని అన్నారు. ఈ నిర్ణయాన్ని టీఆర్‌ఎస్ స్వాగతించడంతోపాటు సంపూర్ణ మద్దతు తెలుపుతోందని అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఏకమై కేంద్రంలో థర్డు ఫ్రంట్ అధికారంలోకి వచ్చే విధంగా సమష్టిగా కృషిచేయాలని కోరారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్‌కు ఏమాత్రం అవకాశాలు లేవని, వామపక్షాల పటిష్టతకోసం ఆ పార్టీ నేతల అభిప్రాయ భేదాలు విడనాడి థర్డుఫ్రంట్‌తో కలిసిరావాలని కోరారు. ఎన్డీయే ప్రభుత్వం కానీ.. గతంలో ఉన్న యుపిఏ ప్రభుత్వం కాని దేశాన్ని అభివృద్ధి చేయడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కుంభకోణాల మయమైందని అన్నారు. బీజేపీ పాలన బ్యాంకుల దోపిడీ పాలనగా తయారైందని అన్నారు. బ్యాంకుల్లో వేలకోట్లు ముంచి విదేశాలకు చెక్కేసే వైట్‌కాలర్ నేరస్థులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత మోదీ ఒక్క కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని అన్నారు. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తే తెలంగాణలో దళితుడిని సీఎం చేస్తారా అన్న ప్రశ్నకు పోలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుంటుందని సమాధానం ఇచ్చారు. సమావేశంలో మంత్రి చందూలాల్, మేయర్ నన్నపనేని నరేందర్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు.

చిత్రం..వరంగల్‌లో సోమవారం విలేఖరులతో మాట్లాడుతున్న డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి