రాష్ట్రీయం

భారతీయ సంస్కృతికి పునర్వైభవం తేవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 5: విదేశీయుల కుట్రలకు బలైన భారతీయ ప్రాచీన సంస్కృతికి పునర్వైభవం తేవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని హంపీ విరూపాక్ష మహాసంస్థాన జగద్గురు శంకరాచార్య శ్రీవిద్యారణ్య భారతీ స్వామీజీ అన్నారు. దైవ దర్శనాల అనంతరం దేవస్థానంలో స్వామీజీ అభిభాషిస్తూ, మెకాలే ద్వారా ప్రపంచానికి సంస్కృతిని నేర్పిన భారతదేశంపై సాంస్కృతిక దాడి జరిగిందని, తద్వారా భారతమాత, గోమాత, గాయత్రీ మాతలను నిర్వీర్యపరిచే కుట్రలకు దేశం బలికాక తప్పలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశ జనాభా 35కోట్లు, గోవుల సంఖ్య 108 కోట్లుండగా, నేడు 130కోట్ల జనాభాకు 20కోట్ల ఆవులే మిగిలి ఉండడం బాధాకరమన్నారు. మాతను మమీగా, పితను డాడీగా చేసి, మదర్స్‌డే, లవర్స్‌డేలను పరిచయం చేసి, కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నానికి పునాదులు వేశారన్నారు. నేటి పిల్లలు నాటి సంప్రదాయాలు మరిచి, భావదాస్యంతో ఆడ అంటే అంటీ, మగ అంటే అంకుల్ అనే అవగాహనతో ఆప్యాయత, అనురాగాలు అన్నింటికీ దూరం కావడం విచారకరమన్నారు.
సాక్షాత్తూ రాష్టప్రతి, ఉప రాష్టప్రతి, ప్రధానితో సహా పార్లమెంట్ ఉభయ సభలలో బిల్లులు చేసినా గో హత్యలను ఆపలేరని, దానికి మూలాలను తెలుసుకోవాలన్నారు. ఆవు వలన ఉపయోగం లేదనే రైతు అమ్ముకుంటున్నాడని, పేడ, మూత్రం తదితరాలను కొని, వాటిని ఎరువులుగా చేసుకుని, వాడే ఆచరణ సాధ్యమైనపుడు రైతు ఆవును అమ్మలా చూస్తాడని వివరించారు. దేశానికి రైతు వెనె్నముక కాగా, ఆవు సకల వరప్రదాయిని అన్నారు.
హంపీపీఠం పక్షాన అమృత వర్షిణి పేరుతో ఆవు పేడ, మూత్రంతో సహజ ఎరువులు, గ్యాస్ తదితరాలను తయారు చేసే కార్యక్రమం విస్తృతంగా చేస్తున్నామని, ప్రభుత్వాలు ఆ కార్యక్రమాలకు చేయూత ఇవ్వాలన్నారు. వాతావరణ సమతుల్యానికి చిన్నవైనా యజ్ఞాలు చేయాలని సూచించారు.