రాష్ట్రీయం

హోదాపై హోరాహోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 6: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, గతంలో ప్రకటించిన ప్యాకేజీనే అమలు చేస్తామని కేంద్రం తేల్చేయడంతో భవిష్యత్తు కార్యాచరణపై టీడీపీ దృష్టి సారించింది. అందులో భాగంగా మంగళవారం సాయంత్రం పార్టీ ఎమ్మెల్యేలతో టీడీపీ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. చర్చలో కేంద్రం నుంచి బయటకు రావాలన్న దానికే పార్టీ మొగ్గుచూపింది. అలా బయటకు వస్తే పోలవరం ప్రాజెక్టుకు నిధులు నిలిచిపోయే అవకాశాలున్నప్పటికీ, అన్ని ఇబ్బందులూ పోరాటాల ద్వారా అధిగమిద్దామని ఎమ్మెల్యేలు చంద్రబాబుకు భరోసా ఇచ్చారు. హోదా రాదన్న సమాచారంతో సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి, అసహనానికి గురయ్యారు. ఈక్రమంలో ఏం చేద్దాం? ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని టీడీఎల్పీ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. ఇలాగే పోరాటం చేసి ఒత్తిడి కొనసాగిద్దామా? లేక మరికొంతకాలం వేచి చూద్దామా? లేక వెంటనే నిర్ణయం తీసుకుందామా? బీజేపీతో పొత్తు కొనసాగించాలా? వద్దా? అని అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెజారిటీ ఎమ్మెల్యేలు హోదా కోసం హోరాహోరీగా పోరాడాల్సిందేనని, ఆ క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొందామని భరోసా ఇచ్చారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందన్న భావన కిందిస్థాయికి వెళ్లిపోయినందున, ఇక బీజేపీ గురించి ఆలోచించడం అనవసరమన్నారు. ఆ పార్టీతో ఏ పార్టీ కలసి ఉన్నా వారికి నష్టం తప్పదని, ఈ రాష్ట్రంలో బీజేపీకి కొత్తగా పోయేదేమీ లేదన్నారు. కష్టమైనా నష్టమైనా తామంతా మీతోనే ఉంటామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ లాంటివాళ్లే పోరాటానికి మద్దతునిస్తున్నారని సమావేశంలో చర్చించారు. అయినా మనకు హోదా ఇస్తే కేంద్రానికి వచ్చే నష్టమేమిటో చెప్పాలని, కేంద్రం ఈ విధంగా ఎందుకు చేస్తుందో తనకు అర్థం కావడం లేదని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ పరిణామాలను మరింత పరిశీలించి, ఒకటి రెండు రోజుల్లో కీలక నిర్ణయం తీసుకుందామన్నారు. నిధులు, విభజన హామీలపై నిన్న సాయంత్రం కూర్చుని మాట్లాడుకుందామన్నారని, కానీ ఆ చర్చలు సానుకూలంగా లేవని బాబు ఎమ్మెల్యేలకు వెల్లడించారు. రాష్ట్ర ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా కాంగ్రెస్- బీజేపీ విభజన బిల్లును పాస్ చేయించాయని, ఇప్పుడూ ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరానికి ఖర్చు చేసిన రూ.3200 కోట్లు రావలసి ఉందని, కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర ప్రస్తావన లేనందుకే తాము నిలదీశామన్నారు. ‘జైట్లీ సానుకూలంగా స్పందిస్తారనుకున్నాం. కానీ జరగలేదు. హోదా, రాయితీల గురించి ఇప్పుడు కొత్తగా అడగటం లేదు. మనపట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారని’ బాబు వ్యాఖ్యానించారు. కాగా, తాజా పరిణామాలపై పార్టీ వైఖరిని శాసనసభ వేదికగా స్పందించాలన్న యోచనతో ఉన్నట్లు సమాచారం. గవర్నర్‌కు ధన్యవాద తీర్మానం తెలిపే సందర్భంలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ ఎమ్మెల్యేలు చెప్పారు.
chitram...
టీడీఎల్పీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు