రాష్ట్రీయం

మీ విద్వత్తుకు మా నజరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 6: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన 20 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మహిళా దినోత్సవ వేడుకల్లో వార్డుతో పాటు రూ. లక్ష నగదును అందించనున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యారంగం నుంచి కవిత దరియాణి (వైస్ చాన్స్‌లర్ జెఎన్‌టియు ఫైన్ ఆర్ట్స్), క్రీడారంగం నుంచి అరుణారెడ్డి (జిమ్నాస్టిక్‌లో వరల్డ్ కప్), వైద్యరంగం నుంచి సత్యలక్ష్మి (ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేచరోపతి, పుణే), మీడియా రంగం నుంచి సౌమ్య నాగపురి, లతా జైన్, సాహిత్యం నుంచి చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ (పద్యకవిత్వం), నాట్యం నుంచి మంజులా శ్రీనివాస్, సంగీతం నుంచి నిత్య సంతోషిణి, చిత్రకళ నుంచి కవితా దేవుష్కర్, సినీ రంగం నుంచి నందినీరెడ్డి (దర్శకురాలు), జానపద సాహిత్యం నుంచి ఝూన్సీ, గానం నుంచి ఎడునూరి పద్మ (తెలంగాణ ఉద్యమ పాటలు), పారిశ్రామిక రంగం నుంచి రాజ్యలక్ష్మి (వడ్డెర సొసైటీ), వృత్తి సేవల రంగం నుంచి సుప్రియా సనమ్ (మెట్రోరైలు లోకో డ్రైవర్ ), ఆర్టీసి డ్రైవర్ సరిత (్ఢల్లీ), మహిళా సాధికారత నుంచి యాప భద్రమ్మ, వ్యవసాయరంగం నుంచి బొగ్గం జయమ్మ, ప్రజాప్రతినిధుల విభాగం నుంచి శైలజ (కొత్తపల్లి గ్రామ సర్పంచ్), సామాజిక సేవ విభాగం నుంచి గండ్ర రమాదేవి ఉన్నారు.