రాష్ట్రీయం

వీసీలున్నట్టా.. లేనట్టా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 7: యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల అలసత్వాన్ని ఇక ఎంతమాత్రం సహించేది లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం రూసా భవన్‌లో జరిగిన వీసీల భేటీలో మాట్లాడుతూ వర్శిటీలకు వీసీలున్నా లేనట్టే ఉన్నాయని వ్యాఖ్యానించారు. వీసీల విధులు, బాధ్యతలు, పనితీరుపై గతంలో రాష్ట్ర గవర్నర్ పలుమార్లు అనేక సూచనలు చేశారన్నారు. ఎలాంటి మార్పూ లేకపోవడంతో, వీసీలు ఏంచేస్తున్నారని ప్రశ్నిస్తు న్న గవర్నర్‌కు ఏంసమాధానం చెప్పాలని కడియం నిలదీశారు. వర్శిటీ కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందుకు సంబంధించి ఏంచర్యలు తీసుకున్నారో చెప్పాలని నిలదీశారు. సమస్యలపై చర్చించకుండా, అన్నీ ఇచ్చినా పనితీరు మెరుగుపర్చుకోకపోతే ఎలాగని నిలదీశారు. లేనిపోని మార్గదర్శకాలు తీసుకువచ్చి వర్శిటీల్లో అధ్యాపకుల నియామకాల ప్రక్రియను ఆపేశారని, ఎప్పటిలోగా ఈ నియామకాలు చేపడతారో చెప్పాలన్నారు. ఓయూలో 400 పోస్టుల భర్తీకి అనుమతిచ్చామని వాటిని భర్తీ చేస్తే విసి రామచంద్రం ఫోటోను నిరుద్యోగులు పెట్టుకుంటారు కదా అని అన్నారు. వర్శిటీలను గాడిలో పెట్టడమంటే ప్రభుత్వ జోక్యంగా భావించవద్దని, పూర్తి పారదర్శకంగా తాము వ్యవహరిస్తున్నామని, ప్రభుత్వం చేస్తున్న సాయాన్ని ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారో చెప్పాలన్నారు. అకడమిక్ క్యాలెండర్, పరీక్షల షెడ్యూలును యూనివర్శిటీలు ఫాలో కావాలని చెప్పామని, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టమని చెప్పినా పెట్టలేదని, కనీసం అనుబంధ కాలేజీల్లో పెట్టమని చెప్పామని అదీ చేయలేదన్నారు. కళాశాలలకు అనుబంధ గుర్తింపు ఇచ్చినపుడు వీటిని పరిశీలించమని అన్నామని, అయినా పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్‌డి అడ్మిషన్లలో పారదర్శకత పాటించాలని సూచించినా, వర్శిటీల్లో గొడవలు ఎందుకు తలెత్తుతున్నాయో ఒకసారి ఆలోచించాలన్నారు. ఎలాంటి తప్పు చేయనపుడు మెరిట్ లిస్టులను ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఇంటర్వ్యూల్లో మార్కులు వేసేటపుడు ఎందుకు పక్షపాతం చూపుతున్నారని నిలదీశారు. ఎవరన్నా అడ్మిషన్లు ఇవ్వమని అడుగుతున్నారా? నేనైతే ఎవరినీ అడగడం లేదు కదా అని కడియం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా వర్శిటీల్లో ఎలాంటి తాత్కాలిక ఉద్యోగ నియామకాలు చేయవద్దని చెబుతున్నా చేస్తూనే ఉన్నారని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అనుబంధ గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పినా, ఇంత వరకూ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. తాను విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐదు వీసీల కాన్ఫరెన్స్‌లు జరిగాయని, కానీ ఆశించిన మేరకు తీసుకున్న నిర్ణయాలు అమలుకావడం లేదని అసలు లోపం ఎక్కడ ఉందో అర్ధం కావడం లేదన్నారు. ప్రభుత్వంలో లోపం ఉందా? మీ పురోగతి లోపమా? అని నిలదీశారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఆరు నెలల్లో అమలు చేస్తామని చెప్పారని, కానీ మళ్లీ గవర్నర్ మీటింగ్ పెడితే ఏం సమాధానం చెబుతారని అన్నారు. 420 కోట్ల రూపాయిల బడ్జెట్ ఇచ్చామని, ఏడు యూనివర్శిటీలకు పనులు పూర్తిచేయమని, టెండర్లు పిలవమని స్వేచ్ఛను ఇచ్చామని, కానీ ఇచ్చిన నిధుల్లో 10 శాతం కూడా ఖర్చు చేయలేదన్నారు. ఈఏడాది మళ్లీ 420 కోట్లు కావాలని అంటున్నారని, గత ఏడాది నిధులే ఖర్చు చేయకపోతే ఈ ఏడాది మళ్లీ కొత్తగా నిధులు ఎందుకని నిలదీశారు. కమిటీ సూచనల మేరకే 1551 పోస్టుల భర్తీకి ఓకే చేశామని, యుజిసి ముసాయిదా నిబంధనలు తెరమీదకు తెచ్చి రిక్రూట్‌మెంట్ ఆపేశారని, ఎంతో నిష్ణాతులను విసిలుగా పెడితే వారు పనిచేయకపోతే ఎలాగని అన్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా వీసీలు పనిచేయాలని, ఇప్పటికైనా కొత్త జిల్లాలకు అనుగుణంగా వర్శిటీలు పునర్వ్యవస్థీకరించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. ఐదేళ్లలో పీహెచ్‌డి పూర్తి చేసేలా చూడాలని, అలాగే అన్ని వర్శిటీల్లో ఇంక్యుబేటర్లు ప్రారంభించాలని, ఇంటర్‌నెట్, లైబ్రరీ, డిజిటలైజేషన్ సదుపాయాలు ఉండాలని అన్నారు. 11 వర్శిటీల వైస్ ఛాన్సలర్లతోపాటు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ వెంకటరమణ, ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
chitram...

రూసా భవన్‌లో జరిగిన వీసీల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కడియం శ్రీహరి