రాష్ట్రీయం

ధర్మపురిలో వైభవంగా రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మపురి, మార్చి 7: సుప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ధర్మపురి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా మధ్యాహ్నం 3గంటలకు వేదమంత్రాలతో, మంగళవాద్యాలతో మూడు రథాలపై శ్రీలక్ష్మీనరసింహ, శ్రీవేంకటేశ్వర, శ్రీరామలింగేశ్వర స్వాములను ఆసీనుల గావించి బలిహరణం, అష్టదిక్పాలకులపూజ, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలను వేదపండితులు నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటలకు భక్తుల జయజయధ్వనాల మధ్య ఇసుకస్థంభం మీదుగా గ్రామపంచాయతి కూడలి వద్దగల నంది విగ్రహం వరకు రథాలను నిలిపి భక్తజనం తోడురాగా రథాలను ఊరేగించగా ముత్తయిదువులు రోడుకిరువైపులా నిలిచి మంగళహారతులు పట్టారు. భక్తుల భక్తిపారవశ్యాల మధ్య చీకటి పడ్డాక నృసింహుడు విముఖుడై మరియు వేంకటేశ్వరుడు, పరమశివుడు సుముఖులై వెనుతిరిగారు. అనంతరం దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలొనరించి గోదావరికి ఊరేగింపుగా వెళ్ళి చక్రతీర్థ మంగళ స్నానాలు ఆచరించారు. ప్రముఖులు రథాలను అధిరోహించి పూజాదికాలలో పాల్గొన్నారు. ధర్మపురి దేవస్థానం చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, ఎసి,ఇఓ సుప్రియ, ధర్మకర్తలు సునీల్ కుమార్, వెంకటేశ్వర్‌రావు, గంగాధర్, రాజన్న, రమాదేవి, నటరాజ్, లింగన్న, భాగ్యలక్ష్మి, శ్రీనివాస్, నరేందర్, ధర్మపురి జడ్పీడీసీ బాదినేని రాజమణి, ఎంపీపీ మమత, వైస్ ఎంపీపీ రాజేశ్, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్, సర్పంచ్ సత్తమ్మ, దేవస్థానం మాజీ చైర్మన్ దినేశ్ శర్మ, మెట్‌పెల్లి డీఎస్పీ మల్లారెడ్డి, సిఐలు లక్ష్మీబాబు, న్రివాస్, నాగేందర్, 10మంది ఎస్‌ఐలు, ప్రత్యేక పోలీసు బృందాలు రోడుకిరువైపులా ముందుండి తాళ్ళద్వారా రథాల రాకపోకల సమయంలో రద్దీని క్రమబద్దీకరించారు.
స్థానిక నాయకులు మార్గనిర్దేశం చేసిన రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. స్థానిక వ్యాపారి మద్ది కిషన్ గుప్త ఆధ్వర్యంలో వేలాది మందికి పులిహోర పొట్లాలను అందజేశారు. ఆర్యవైశ్యులు పెరగన్నం పంచారు. చివరగా గోదావరిలో చక్రతీర్థ స్నానానంతరం ఆచారం ప్రకారం మధ్వాచారి రాంకిషన్ గృహంలో స్వామి వారు, భక్తజన సమేతులై విందు ఆరగించి, రాత్రి దేవస్థానానికి చేరుకున్నారు.
chitram...
ధర్మపురిలో లక్ష్మీనారసింహ, రామలింగేశ్వర, వేంకటేశ్వర స్వామివార్ల రథోత్సవం