రాష్ట్రీయం

సాగుకు భారీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 8: రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు, లాభసాటిగా మార్చేందుకు వీలుగా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో 19070 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. రైతే ముందు అన్న నినాదంతో సాగు ఖర్చులు తగ్గించేందుకు, దిగుబడులు పెంచడమే లక్ష్యంగా వ్యవసాయ బడ్జెట్‌ను రూపకల్పన చేసింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో ఆ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, శాసన మండలిలో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో సోమిరెడ్డి మాట్లాడుతూ రైతులను కరువు బారి నుండి విముక్తి కల్పించేందుకు ఏపీ కరువు నివారణ ప్రాజెక్టును 1042 కోట్లతో అమలు చేయనున్నారు. 1600 కోట్ల రూపాయలతో 2లక్షల మంది రైతులకు మేలు చేకూరేలా ఆయకట్టు ప్రాంతాల్లో వ్యవసాయాభివృద్ధికి నిధులు కేటాయించారు. జైకా నిధులతో వ్యవసాయ యంత్రాల శిక్షణా కేంద్రాలను 420 కోట్ల రూపాయలతో స్థాపించనున్నారు. పంటల బీమా పథకం అమలుకు 485 కోట్ల రూపాయలు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వ హామీకి అనుగుణంగా రైతులను ఆదుకునేందుకు నాల్గవ విడత రుణ ఉపశమనానికి 4,100 కోట్ల రూపాయలు కేటాయించారు. వరి, వేరుశనగ, రాగి, జొన్నలకు సంబంధించి 17 కొత్తరకం వంగడాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కృష్ణాజిల్లా గన్నవరంలో 12 ఎకరాల్లో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ సెంటర్ నెలకొల్పేందుకు రాష్ట్ర వాటాగా 10 కోట్ల రూపాయలు కేటాయించారు. సమీకృత ఉద్యానాభివృద్ధి మిషన్ కింద ఉద్యాన పంటల అభివృద్ధికి 149కోట్ల రూపాయలు కేటాయించింది. బిందు, తుంపర సేద్య పరికరాల సరఫరాకు 1152కోట్ల రూపాయలు కేటాయించారు. పట్టు పరిశ్రమ ద్వారా వివిధ పథకాల అమలుకు 74 కోట్ల రూపాయలు కేటాయించారు. సముద్ర నాచు పెంపకం, సముద్ర జలాల్లో పంజరాలతో చేపల పెంపకం, మండపీత, పండుగప్ప హేచరీల స్థాపన కూడా బడ్జెట్‌లో ప్రతిపాదించారు. రాష్ట్రాన్ని ప్రపంచ ఆక్వా హబ్‌గా మార్చేందుకు 366 కోట్ల రూపాయలు కేటాయించారు. మరో 47 మార్కెట్ కమిటీల్లో ఈనాం పథకం ప్రవేశపెట్టనున్నారు. 14 వ్యవసాయ మార్కెట్లను, 89 రైతుబజార్లను ఆధునీకరించనున్నారు. లక్ష పంపుసెట్లను మార్చేందుకు వీలుగా విద్యుత్ శాఖకు 2500 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుబంధ రంగాల్లో 3980 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు ప్రతిపాదించారు. వరి విస్తీర్ణం గత సంవత్సరంతో పోలిస్తే 3శాతం తగ్గినప్పటికీ ఖరీఫ్‌లో హెక్టారుకు 5176 కిలోల మేర అధిక దిగుబడి సాధించినట్లు మంత్రి తెలిపారు. దేశంలో మొక్కజొన్న ఉత్పత్తిలో రెండవ స్థానం, వరిలో మూడవ స్థానం, పత్తి, చెరకు పంటలో నాల్గవ స్థానంలో ఉన్నామన్నారు. మిరప, కోకో, నిమ్మ, ఆయిల్‌పాం, బొప్పాయి, టమాటా ఉత్పత్తిలో మొదటి స్థానంలో జీడిమామిడి, బత్తాయిల్లో రెండవ స్థానంలో ఉన్నామన్నారు. మెగా సీడ్ పార్క్ నిర్వహణకు 100 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో దిగుబడులు పెంచేందుకు రాయితీపై విత్తనాలు, కలుపు మందులు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. 2022 నాటికి ఐదు లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేపట్టనున్నారు.

చిత్రం..అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి సోమిరెడ్డి