రాష్ట్రీయం

యువ వర్కింగ్ మహిళలో పెరుగుతున్న థూమపానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 8: దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో ఉద్యోగం యువతులు వత్తిడి తట్టుకోలేకక ధూమపానానికి అలవాటు పడుతున్నారని, ఈ సంఖ్య పెరుగుతోందని అసోచామ్ సర్వేలో వెల్లడైంది. దేశ వ్యాప్తంగా అహమ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, జైపూర్, కోల్‌కొత్తా, లక్నో, ముంబాయి, పూణే తదితర నగరాల్లో ఈ సర్వేను అసోచామ్ సామాజిక విభాగం సర్వేను నిర్వసించింది. రెండు వేల మందిని వివిధ వివరాలు అడిగారు. 22 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న ఉద్యోగం చేసే మహిళలను పరిగణనలోకి తీసుకున్నారు. ఎక్కువ వేతనం పొందుతున్న మహిళల్లో ధూమపానం పెరిగింది. దీని వల్ల మహిళలకు గుండె వ్యాధుల రిస్క్ తలెత్తుతున్నాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ పేర్కొన్నారు. మెట్రో నగరాల్లో కమర్షియల్ హబ్స్‌లో పనిచేసే మహిళలు విధి నిర్వహణలో తీవ్ర వత్తిడికి గురవుతున్నారు. సర్వే చేసిన వారిలవో 40 శాతం మంది లైట్ స్మోకర్స్‌గా గుర్తించారు. రోజుకు ఒకటి నుంచి రెండు సిగరెట్లు కాల్చుతున్నారు. మరో 12 శాతం మంది రోజుకు రెండు నుంచి మూడు సిగరెట్లు కాలుస్తున్నారు.