బిజినెస్

ఐఐపీ గణాంకాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 11: పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వంటి కీలక స్థూలార్థిక గణాంకాలు సోమవారం నుంచి మొదలయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలను నిర్దేశించనున్నాయని నిపుణులు అంచనా వేశారు. ‘సీపీఐ (వినియోగ వస్తువుల ధరల సూచీ), ఐఐపీ గణాంకాల కోసం మదుపరులు అప్రమత్తతతో ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 4.74 శాతానికి తగ్గుతుందని అంచనా’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. బాండ్ మార్కెట్‌కు సీపీఐ గణాంకాలు ఎంతో కీలకమయినవని, గత ఆరు నెలలుగా భారత ఈక్విటీ మార్కెట్‌ను ఈ గణాంకాలు ప్రభావితం చేస్తున్నాయని ఎపిక్ రీసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. జనవరి నెలలో చిల్లర ద్రవ్యోల్బణం 5.07 శాతానికి తగ్గగా, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆరు నెలల కనిష్ట స్థాయి 2.84 శాతానికి తగ్గింది. 2017 డిసెంబర్‌లో వినియోగ వస్తువుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.21 శాతం ఉండగా, టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 3.58 శాతం ఉండింది. ఇదిలా ఉండగా, వస్తు తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్ సెక్టర్) పనితీరు బాగా మెరుగుపడటంతో పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకొని డిసెంబర్ నెలలో 7.1 శాతానికి పెరిగింది. క్యాపిటల్ గూడ్స్, నాన్-డ్యూరేబుల్ కన్స్యూమర్ గూడ్స్ కొనుగోళ్లు పెరగడం కూడా పారిశ్రామికోత్పత్తి పుంజుకోవడానికి దోహదపడింది. ఈ నేపథ్యంలో ఐఐపీ గణాంకాలు ఈసారి దేశీయ స్టాక్ మార్కెట్‌లో లావాదేవీలను గణనీయంగా ప్రభావితం చేస్తాయని నదీమ్ విశే్లషించారు. ‘బ్యాంక్ నిఫ్టీ అత్యధిక భారాన్ని కలిగి ఉంది. 200 రోజుల సగటుకు దిగువన దీనిలో లావాదేవీలు జరుగుతున్నాయి. అందువల్ల ఐఐపీ గణాంకాలు, వినియోగ వస్తువుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం వచ్చేవారం దేశీయ స్టాక్ మార్కెట్‌ను కీలకంగా ప్రభావితం చేయనున్నాయి’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ వికాస్ జైన్ విశే్లషించారు. రంగాల వారీగా చూస్తే, వాహన, ప్రైవేటు బ్యాంకులు, కన్స్యూమర్ డ్యూరేబుల్స్ సానుకూలంగా ఉంటాయని జైన్ పేర్కొన్నారు.