రాష్ట్రీయం

అసెంబ్లీలో నియంతృత్వ విధానాలు సాగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 12: శాసన సభలో గవర్నర్ ప్రసంగంపై తమ నిరసన తెలుపుతు రైతు సమస్యలపై ప్రశ్నించేందుకు పోడియం దగ్గరకు వెళుతున్న కాంగ్రెస్ శాసన సభ్యులను 100మంది మార్షల్స్‌తో అడ్డుకుంటూ తెరాస ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరించింద ని సిఎల్పీ ఉపనేత, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండలో మీడియాతో మాట్లాడుతూ శాసన సభలో తెరాస
నియంతృత్వ విధానాలను కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదన్నారు. మార్షల్ బలవంతంగా నెట్టివేయడంతో తన కాలికి గాయమైందన్నారు. మార్షల్స్ అడ్డుకున్న క్రమంలో చేతిలోని పేపర్లు, హ్యాండ్‌సెట్‌ను పోడియంపైకి విసిరామన్నారు. అప్పుడు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, తాము విసిరిన హ్యాండ్ సెట్ పోడియం దాకా కూడా వెళ్లలేదన్నారు. అయితే పావుగంట తరువాత సీఎం కేసీఆర్ దర్శకత్వంలో నాటకానికి తెరలేపిన తెరాస, కంటికి బ్యాండేజ్‌తో వీల్‌చైర్‌పై స్వామిగౌడ్‌ను తీసుకవచ్చి గాయపరిచామంటూ దుష్ప్రచారం ప్రారంభించిందన్నారు. నిజంగా స్వామిగౌడ్‌పై కేసీఆర్‌కు ప్రేమ ఉంటే తన కంటి ఆపరేషన్‌కు ఢిల్లీలో చికిత్స చేయించుకున్నట్లుగానే స్వామిగౌడ్‌కు కూడా మంచి చికిత్స అందించాలన్నారు. తాము పోడియం దగ్గర వెళ్లడాన్ని అడ్డుకుంటున్న తెరాస, పార్లమెంటులో రిజర్వేషన్ల పెంపు కోసం ఎంపీలను పోడియం దగ్గరకు ఎందుకు పంపుతుందో చెప్పాలన్నారు. రైతాంగ సమస్యలపై ఎన్నికల్లో తెరాస ఇచ్చిన హామీల వైఫల్యాలపై అసెంబ్లీలో నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం స్వామిగౌడ్‌తో కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు.

చిత్రం..అసెంబ్లీలో మార్షల్స్ దాడిలో కాలికి గాయమైందని చూపుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి