రాష్ట్రీయం

మే 31న ఎడ్‌సెట్ జూన్ 3న తొలి కీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: రాష్ట్రంలోని బిఇడి కోర్సులో చేరేందుకు ఎడ్‌సెట్ నోటిఫికేషన్‌ను ఈనెల 15న జారీ చేయనున్నారు. సోమవారం జరిగిన సెట్ కమిటీలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను 18నుంచి స్వీకరిస్తామని, ఏప్రిల్ 20 వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తామని, 500 జరిమానాతో ఏప్రిల్ 30వరకూ, 2వేల జరిమానాతో మే 15 వరకూ, 5వేల జరిమానాతో మే 25 వరకూ స్వీకరిస్తారు. మే 20 నుండి హాల్‌టిక్కెట్లు జారీ చేస్తారు. వాటిని మే 26 వరకూ అభ్యర్ధులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో మే 31, జూన్ 1 తేదీల్లో జరగుతుంది. పరీక్ష ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 వరకూ ఒక సెషన్, మధ్యాహ్నం 2.30 నుండి
సాయంత్రం 4.30 వరకూ మరో సెషన్ జరుగుతుందని పాపిరెడ్డి వివరించారు. తొలి కీని జూన్ 3న విడుదల చేస్తామని, దానిపై అభ్యంతరాలను మే 5 వరకూ స్వీకరించి, జూన్ 11న తుది ఫలితాలను ఇస్తామని అన్నారు.
మే 25న లాసెట్
లాసెట్ నోటిఫికేషన్‌ను ఈనెల 22న విడుదల చేయనున్నారు. 25నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఏప్రిల్ 25 వరకూ ఎలాంటి అపరాధ రుసుం లేకుండా దరఖాస్తులను స్వీకరిస్తారు. 500 జరిమానాతో మే 2 వరకూ, వెయ్యి జరిమానాతో మే 9 వరకూ, 2వేల జరిమానాతో మే 16 వరకూ, 4వేల జరిమానాతో మే 23 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. ఇక హాల్‌టిక్కెట్లను మే 22 నుండి జారీ చేస్తారు. పరీక్ష మే 25న ఆన్‌లైన్‌లో జరుగుతుంది. తొలి కీని మే 28న విడుదల చేసి అభ్యంతరాలను 29 వరకూ స్వీకరిస్తారు. ఫలితాలను జూన్ 10న విడుదల చేస్తారు. పీజీ లాసెట్‌కు సైతం దాదాపు ఇదే షెడ్యూలను అనుసరిస్తారు. మార్చి 25 నుండి ఏప్రిల్ 25 వరకూ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. వెయ్యి జరిమానాతో మే 9 వరకూ, 2వేల జరిమానాతో మే 16 వరకూ, 4వేల జరిమానాతో మే 23 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. పరీక్ష మే 25న ఆన్‌లైన్‌లో జరుగుతుంది. ఫలితాలను జూన్ 10న వెల్లడిస్తారు.