రాష్ట్రీయం

ఏసీబీ వలలో ఇన్‌చార్జి ఆర్‌ఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, మార్చి 13: వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నగర పంచాయతీలో అధికారి ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏకకాలంలో నాలుగు బృందాలుగా విడిపోయి ఆపరేషన్ ప్రారంభించారు. నగర పంచాయతీలో పనిచేస్తున్న ఇన్‌చార్జి ఆర్‌ఐ మేర్గు మురళి ఓనర్‌షిప్ సర్ట్ఫికెట్ కోసం ఓ వ్యక్తి వద్ద పదివేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీడీ సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. నర్సంపేటకు చెందిన జడల శ్రీనివాస్, అతని తమ్ముడు వెంకటేశ్వర్లుకు పట్టణంలోని మల్లంపల్లి రోడ్‌లో ఇల్లు ఉంది. కాగా ఈ ఇల్లును తమ కుటుంబ అవసరాలకోసం ఇతరులకు ఈ మధ్యనే విక్రయించారు. ఈ క్రమంలో ఇంటికి సంబంధించిన యాజమాన్య ధ్రువీకరణ పత్రంకోసం నగర పంచాయతీలో 2017 డిసెంబర్ 22వ తేదీన దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే 20 వేల రూపాయలు ఇవ్వాలని, అన్నీ తానే చూసుకుంటానని ఇన్‌చార్జి ఆర్‌ఐ మేర్గు మురళి వెంకటేశ్వర్లుకు కరాఖండీగా తేల్చిచెప్పాడు. జనవరి మొదటి వారంలో వెంకటేశ్వర్లు 20 వేల రూపాయలు ఇచ్చాడు. అయినప్పటికీ యాజమాన్య ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోగా మరో పదివేల రూపాయలు ఇస్తేనే పని అవుతుందని ఆర్‌ఐ మురళి చెప్పాడు. ఒప్పందం ప్రకారం సర్ట్ఫికెట్ ఇవ్వాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జడల వెంకటేశ్వర్లు కొద్ది రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మంగళవారం ఏసీబీ డీడీ సుదర్శన్‌గౌడ్ నేతృత్వంలో ఏసీబీ బృందాలు రంగంలోకి దిగాయి. డబ్బులు ఇస్తానని వెంకటేశ్వర్లు ఆర్‌ఐ మురళీకి ఫోన్ చేశాడు. తాను మల్లంపల్లి రోడ్డు సమీపంలోని అరవింద థియేటర్ వద్ద ఉన్నానని వెంకటేశ్వర్లు ఫోన్‌లో చెప్పడంతో మురళి అక్కడికి చేరుకున్నాడు. ప్రధాన రహదారి పక్కనే ద్విచక్రవాహనాన్ని మురళి ఆపాడు. వెంకటేశ్వర్లు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మురళి తీసుకున్న పదివేల రూపాయలతోపాటు అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని, మురళీని ఏసీబీ కోర్టులో హాజరు పర్చి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసీబీ డీడీ సుదర్శన్‌గౌడ్ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్‌చార్జి డీఎస్పీ కిరణ్‌కుమార్, ఇన్‌స్పెక్టర్లు సతీష్, పులి వెంకట్, క్రాంతి కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం..మురళిని విచారిస్తున్న ఏసీబీ అధికారులు