రాష్ట్రీయం

భారీగా బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కస్టమ్స్ సుంకం చెల్లించని విదేశీ బంగారాన్ని సినీ ఫక్కీలో అక్రమంగా తరలిస్తున్న తమిళనాడుకు చెందిన ఒక స్మగ్లర్‌ను విజయవాడ కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి కోటీ 45 లక్షల విలువైన 5 కేజీల 330 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఆటోనగర్‌లోని కస్టమ్స్ ప్రధాన కార్యాలయంలో ఎపి కస్టమ్స్ కమిషనర్ ఎస్.ఖాదర్ రెహమాన్ బంగారం స్మగ్లింగ్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. మలేసియా నుండి అక్రమంగా దిగుమతి అయిన బంగారాన్ని కొందరు బడా స్మగ్లర్లు కోల్‌కతాకు చేరవేయగా, అక్కడి నుండి రైలులో ఒక కొరియర్ సోమవారం చెన్నై తీసుకువెళుతున్నాడు. ఈ బంగారాన్ని ఎవరూ గుర్తించని విధంగా వాటర్ డిస్పెన్సరీ కంప్రెషర్‌లో రహస్యంగా, చిన్న చిన్న గోళీల రూపంలో అమర్చి తీసుకువెళ్లటం విశేషం. ముందుగానే పసిగట్టిన కస్టమ్స్ అధికారులు స్మగ్లర్ (కొరియర్)పై నిఘా వేసి రాజమండ్రి స్టేషన్‌లో తనిఖీ చేయగా అసలు విషయం బట్టబయలైంది. తదుపరి విచారణ నిమిత్తం స్మగ్లర్‌ని విజయవాడ కస్టమ్స్ కార్యాలయానికి తరలించి వాంగ్మూలాన్ని నమోదు చేసి కస్టమ్స్ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు. రిమాండ్ కోసం మంగళవారమే ఆర్థిక నేరాల న్యాయస్థానానికి తరలించారు.
ఈ బంగారాన్ని గమ్యం చేరవేసేందుకు సదరు కొరియర్‌కు 7 వేలు రూపాయలు మాత్రమే పారితోషికం ముట్టచెప్తారని నిందితుడు వెల్లడించినట్టు కమిషనర్ చెప్పారు. విజయవాడ కస్టమ్స్ పరిధిలో ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకోవటం ఇదే మొదటిసారి అన్నారు. విదేశీ బంగారానికి సంబంధించిన సమాచారాన్ని తెలియజేసిన వారికి పట్టుబడిన వాటిలో 20 శాతం నగదు బహుమతిగా ఇస్తామని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. స్మగ్లింగ్ విషయాన్ని తమ కార్యాలయ ఫోన్ నెంబర్లు 9885566233, 9849848060కు తెలియజేయాలని కోరారు.