రాష్ట్రీయం

సిఐడి కస్టడీకి అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు : అగ్రిగోల్డ్ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకట శేషు నారాయణరావును ఏడు రోజులు సిఐడి కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఇన్‌ఛార్జి జిల్లా న్యాయమూర్తి హరిహరనాధ శర్మ మంగళవారం ఈ నిర్ణయాన్ని వెలవరించారు. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో సిఐడి పోలీసులు అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండిలను అరెస్టు చేయడం తెలిసిందే.
అనంతరం జిల్లాలోని పెదపాడు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసునకు సంబంధించి వారిని ఏలూరు కోర్టులో హాజరుపర్చడం, వారికి ఈ నెల 24 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించడం తెలిసిందే. అయితే వెనువెంటనే సిఐడి పోలీసులు వీరిద్దరినీ తమ కస్టడీకి అప్పగించాలని, మరిన్ని వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందంటూ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా అరెస్టైన అగ్రిగోల్డ్ ఛైర్మన్, ఎండిలు బెయిల్ కోరుతూ పిటిషన్లు దాఖలుచేశారు.
వీటిపై సోమవారం సాయంత్రం వాదోపవాదాలు జరిగాయి. అనంతరం నిర్ణయాన్ని మంగళవారానికి న్యాయమూర్తి వాయిదావేశారు. మంగళవారం ఈ విషయంలో నిర్ణయం వెలువరిస్తూ ఛైర్మన్, ఎండిల బెయిల్ పిటీషన్‌ను నిరాకరిస్తూ అదే సమయంలో వారిద్దరినీ బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఈ నెల 23వ తేదీ సాయంత్రం వరకు సిఐడి కస్టడీకి న్యాయమూర్తి అనుమతించారు. సిఐడి పోలీసులు న్యాయవాదుల సమక్షంలోనే వీరిద్దరినీ విచారించాల్సి వుంటుందని, అవసరమైన వైద్య సదుపాయాలను కూడా కల్పించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అలాగే థర్డ్ డిగ్రీ విధానాలు వినియోగించకూడదని కూడా స్పష్టం చేశారు.