ఆంధ్రప్రదేశ్‌

టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మేమూ చేస్తాం: విష్ణుకుమార్ రాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 21: పొత్తు కకావికలమైనందున టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తమ నలుగురు సభ్యులు కూడా తక్షణం రాజీనామా చేస్తామని శాసనసభలో బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు స్పష్టం చేశారు. ప్రాజెక్టుల విషయమై బుధవారం శాసనసభలో వాడి వేడిగా చర్చ జరిగింది. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్టు నిధులు వృథా అయ్యాయని ఆరోపించారు. దీంతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అప్పుడు కనిపించని అవినీతి ఇప్పుడు కనిపించిందా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ మొదట్లో తమకు తెలియదని, కాగ్ నివేదిక చూశాకే మాట్లాడుతున్నానన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదనే ఉద్దేశంతో కాగ్ నివేదిక చూసిన తర్వాత మాట్లాడుతున్నానని అన్నారు. పట్టిసీమకు రూ.190 కోట్లు వృథాగా ఖర్చు పెట్టారని, మరో రూ.371 కోట్లు దుర్వినియోగం అయినట్లు కాగ్ తెలిపిందని విష్ణుకుమార్ రాజు అన్నారు. పట్టిసీమపై సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో దర్యాప్తు చేయ్యాలని ఆయన డిమాండ్ చేశారు. క్యూబిక్ మీటర్ మట్టి తీయడానికి రూ.21,350 ఖర్చు చేశారని ఆరోపించారు. రాజకీయ కారణాలతో తమను బయటికి పంపి బురదజల్లడం సరికాదన్నారు.