రాష్ట్రీయం

నేటి నుంచి తిరుపతిలో ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 22: చిత్తూరు జిల్లా తిరుపతిలో ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు ప్రపంచ ఆధ్యాత్మికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వెల్లడించారు. గురువారం తిరుపతిలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. 24వ తేదీన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్ ధార్మిక సత్సంగ్, ముఖాముఖి ఉంటుందన్నారు. ఇవి తిరుపతి శిల్పారామంలో యోగా, ధ్యానం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహతి ఆడిటోరియంలో వర్క్‌షాప్, ప్యానెల్ చర్చలు ఉంటాయన్నారు. 23న ఉదయం సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రాచీన ఇండియన్ ఆస్ట్రానమీపై సదస్సులు ఉంటాయన్నారు. మధ్యాహం పని, హోంలైఫ్ సంతురణం, సంఘంలో మహిళ పాత్రపై అనే అంశంపై చర్చా కార్యక్రమం జరుగుతుందన్నారు. 24న పండిట్ రవిశంకర్ ఉపన్యాయసం ఉంటుందన్నారు. 26న సేవ, ఆధ్యాత్మికతపై, మధ్యాహ్నం భారతదేశం పెరుగుదల-సంఘర్షణపై తీర్మానాలు, ఆధ్యాత్మిక పాత్ర అనే అంశంపై సదస్సులు ఉంటాయన్నారు.