రాష్ట్రీయం

ఐదు నగరాల్లో టీహబ్ విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో టీ హబ్‌ను ఐదు నగరాలకు విస్తరిస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శాసనసభలో గురువారం నాడు వెల్లడించారు. పువ్వాడ అజయ్‌కుమార్, బీగాల గణేశ్, గాదరి కిశోర్‌కుమార్ తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పా రు. రెండో టీహబ్ పూర్తయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా ఆవిర్భవిస్తుందని వెల్లడించారు. అంకుర పరిశ్రమలను ప్రోత్సహించడానికే టెక్నాలజీ ఇంక్యూబేటర్‌ను నెలకోల్పామన్నారు. రెండో దశలో 3.60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ ఏర్పాటు కాబోతోందని కేంద్రం సై న్స్ అండ్ టెక్నాలజీ నివేదిక ప్రకారం దేశంలో అత్యధిక ఇంక్యుబేటర్లు ఉన్న నగరంగా హైదరాబాద్ గుర్తింపు పొందిందని చెప్పారు. ప్రస్తుత గ ణాంకాల ప్రకారం 346 అంకుర ఇంక్యుబేటర్లు ఉన్నాయని, 835 అనుబంధ అంకురాలు, 190 పూర్వ అంకురాలు, 117మెంటార్స్, 32 సామాజిక భాగస్వామ్యాలు, 27 ఐపి ట్రేడ్ మార్కులు, 23 వ్యాపార మద్దతు సేవలు ఈ హబ్ ద్వారా సాధించిన విజయాలని అన్నారు. నెల ఒక్కంటి కీ 376 మెంటార్ సెషన్స్ జరుగుతున్నాయని, నె లకు 16 ఈవెంట్లు జరుగుతున్నాయని చెప్పారు. 27 మంది వైస్ ఛాన్సలర్లు ఐటి హబ్‌ను సందర్శించారని మంత్రి వెల్లడించారు. ఇంటెల్, హెచ్ పీ, యూటీసీ, డీబీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫే స్‌బుక్ వంటి ఐటీ, ఐటీ పరిష్కార సంస్థలు, బ్యాంకింగ్, అర్బన్ యుటిలిటీ సంస్థలు సైతం ఇపుడు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను సర్దుబా టు చేసే స్థితిలో లేవన్నారు. కొత్తగా స్టార్టప్‌లలో నే ఉద్యోగ అవకాశాలున్నాయని గుర్తించి ప్ర భుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని చెప్పారు. గ్రామీణ ఆవిష్కర్తలను కూడా భాగస్వామ్యం చేశామని చెప్పిన మంత్రి, చింతకింది మల్లేశం వంటి వస్త్ర కళా నిపుణులకు కూ డా ఆర్థ్ధికసాయం అందించి, ప్రోత్సహిస్తున్నామ ని వివరించారు. టెక్నాలజీ హబ్ హైదరాబాద్‌కే పరిమితం కారాదని, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లకు కూ డా విస్తరింపచేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ నగరంలో టీహబ్ రెండో దశ పూర్తికాబోతోందని, దీంతో పాటు గోవా, అస్సాం, ఢిల్లీ వం టి రాష్ట్రాలకు సైతం స్టార్టప్‌లలో సాంకేతిక స హకారం, దిశానిర్దేశం చేస్తున్నామన్నారు. చిన్నతనం నుంచి స్టార్టప్‌పై ఆసక్తి, పెంచేందుకు కాలే జీ స్థాయిలో స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఏర్పాటు చేశామని, దానికి సంచాలకుడిగా రెడ్ బస్ యా ప్ క్రియేట్ చేసి సంచలనం సృష్టించిన సామా ఫణీంద్రను నియమించినట్లు చెప్పారు.