రాష్ట్రీయం

ఖర్చంతా.. కేంద్రానిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ లక్షా 7వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రపంచంలోనే వివిధ దేశాల రాజధానులను తలదనే్నలా అద్భుత రాజధాని నగర నిర్మాణాన్ని చేపట్టి పూర్తిచేసి తీరుతామంటూ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం 217 చ.కిమీ పరిధిలో 1450 ఎకరాల్లో చేపట్టిన శాసనసభ, సచివాలయం, హైకోర్టు, అధికారుల నివాస భవనాలు, రాజ్‌భవన్, పరిపాలనా భవనాల నిర్మాణానికి గాను 11వేల 600 కోట్లను మాత్రం కేంద్ర ప్రభుత్వమే భరించాల్సి ఉందని చెప్పారు. శాసనసభలో శనివారం ప్రశ్నోత్తరాల అనంతరం నియమావళిలోని 344వ నియమం కింద ‘అమరావతి రాజధాని నగరాభివృద్ధి’ అంశంపై సభ్యులు అత్తార్ చాంద్ బాషా, జివి ఆంజనేయులు, వై.సాంబశివరావు ఇచ్చిన నోటీస్‌పై మంత్రి నారాయణ దాదాపు అరగంటసేపు అమరావతి నగర నిర్మాణ తీరుతెన్నులను వివరించారు.
తిరుపతి ఎన్నికల ప్రచార సభలోనూ ఆపై రాజధాని నగర శంకుస్థాపన సభలోనూ ప్రధాని మోదీ ఇచ్చిన హామీలేవీ నేటి వరకు పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదన్నారు. పైగా ఢిల్లీని తలదనే్న రీతిలో ఏపీ రాజధాని నిర్మాణానికి అనేక దేశాల్లోని రాజధానులను సందర్శించి రావాలని కూడా సలహా ఇచ్చిన మోదీ నేడు విస్మరిస్తుండటం బాధాకరమన్నారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇప్పటివరకు కేవలం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చి ఇంకా కేవలం వెయ్యి కోట్లు మాత్రమే ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. దీనికి బీజేపీ నేతలు ఏం సమాధానం చెబుతారంటూ సభలో ఉన్న ఆ పార్టీ ఫ్లోర్‌లీడర్ పెనె్మత్స విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి ప్రశ్నించారు. ఆ సమయంలో టీడీపీ సభ్యులు బల్లలు చరుస్తూ షేమ్.. షేమ్ అంటూ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం మొదటి నుంచి కూడా రాజధాని నిర్మాణానికి అనేక రకాల అవరోధాలు సృష్టిస్తూ వచ్చిందని హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇతర న్యాయస్థానాల్లోనూ తప్పుడు కేసులు దాఖలు చేయటం, రైతులను రెచ్చగొట్టడం, పంట పొలాలను తగులబెట్టించి భయభ్రాంతులకు గురిచేయడం వంటి దురాగతాలకు
దిగాయంటూ నిప్పులు చెరిగారు. నార్మన్ పోస్టర్స్ సంస్థ ఏప్రిల్‌లో అసెంబ్లీ, హైకోర్టు తుది డిజైన్లను ప్రభుత్వానికి సమర్పిస్తుందన్నారు. తొలి దశలో 217 చ.కిమీ విస్తీర్ణంలో 9 నగరాలను నిర్మించనున్నామన్నారు. ఇందులో 30 శాతం పూర్తిగా నీల-హరిత శోభితంగా పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. దాదాపు మూడు లక్షల మొక్కలను నాటుతున్నామన్నారు. కొండవీటివాగు, పాల వాగులను పూడ్చేస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈ వాగులను మూడు రెట్లు అదనంగా మరింత లోతుగా, వెడల్పు చేయడమే కాకుండా ఇరువైపులా వివిధ నిర్మాణాలు చేపడతామని, ఆరు ప్రదేశాల్లో రిజర్వాయర్లు నిర్మించి నీటిని నిలువచేస్తూ భారీ వరదలు వచ్చినప్పుడు నదిలోకి వదలటానికి పంపింగ్ మిషన్లు ఏర్పాటు చేయబోతున్నామని, వాగుల్లో జల రవాణాకు చర్యలు చేపట్టామని అన్నారు. కృష్ణానదిపై ఐదు ఐకానిక్ వంతెనలు నిర్మిస్తున్నామన్నారు. రూ.1387 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించబోయే తొలి వంతెనకు టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. రాజధాని ప్రాంతంలో 1600 కిమీ రోడ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇదిలా ఉంటే కేవలం ఆరు మాసాల వ్యవధిలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ 7 లక్ష్యంతో చేపట్టి ప్రస్తుతానికి జీ ప్లస్ ఒన్‌తో పూర్తయిన భవనాల నిర్మాణానికి రూ.484 కోట్లు వ్యయం కాగా అంత ఖర్చు ఏమిటంటూ కొందరు అవినీతి ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వాస్తవానికి భవిష్యత్‌లో నిర్మించే పై అంతస్తులకు అంత వ్యయం కాదన్నారు. పారదర్శకంగా ఎస్‌ఎస్‌ఆర్ రేట్లతోనే నిధులు కేటాయించామన్నారు. 100 అడుగుల లోతులో పునాదుల నిర్మాణం, ఆపై మెరకకు భారీగా ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. అసలు రాజధాని స్థలం ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణ కమిటీ ఒక్కో పేజీలో ఒక్కో జిల్లాను ప్రస్తావిస్తూ చివరకు ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించిందన్నారు. సింగపూర్ సంస్థ ఉచితంగా మాస్టర్ ప్లాన్ డిజైన్ రూపొందించి ఇచ్చిందన్నారు. ఇక ప్రధాన రాజధాని 9 నగరాలు, 29 పట్టణాలు, వేలాది నివాస భవనాలతో నిర్మాణాలు జరుగబోతున్నాయని అన్నారు. ప్రతి పట్టణానికి వెయ్యి ఎకరాల్లో లక్షమంది ప్రజలు నివసించేందుకు వీలుగా నిర్మిస్తున్నామన్నారు. పరిపాలన నగరంలో సచివాలయ ప్రధాన శాఖల కార్యాలయాలు, అధికారుల నివాసాలు, జస్టిస్ సిటీలో హైకోర్టు న్యాయమూర్తుల నివాసాలు ఉంటాయని అన్నారు. 97.5 కిమీ పొడవుతో 8 వరుసలతో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నారంటూ ఏది ఏమైనా ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు మాట్లాడుతూ కేంద్రం ఎన్నో రకాలుగా రాజధాని నిర్మాణానికి సహకరిస్తామంటే విమర్శలెందుకన్నారు. నోట మట్టి కొట్టారు.. నీళ్లు చల్లారనడం సరైనది కాదన్నారు. వివిధ నదుల నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో మోదీ ఈ ప్రాంతాన్ని శుద్ధి చేశారని అన్నారు. ఈ సందర్భంగా కిమిడి మృణాళిని, బొండా ఉమామహేశ్వరరావు, చాంద్ బాషా, తెనాలి శ్రావణ్‌కుమార్, కూన రవికమార్ తదితరులు ప్రశ్నించారు.