రాష్ట్రీయం

వైభవోపేతంగా జానకీ రాముల కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేములవాడ టౌన్, మార్చి 25: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హరిహర క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో సీతారాముల క ల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివా రం అభిజిత్‌లగ్న సుముహూర్తాన ఉదయం 11.45 గంటలకు కల్యాణాన్ని ఆలయ అర్చకులు ప్రారంభించారు. నునుసిగ్గుల మొలక అయిన సీ తమ్మ నొసటన కల్యాణ బొట్టును, బుగ్గన కాసింత దిష్టిచుక్కను పెట్టకొని వేములవాడ నగర గ్రామపంచాయతీ పాలకవర్గం, అధికారులు కల్యాణాని కి ముందు సమర్పించిన పట్టువస్త్రాలను ధరించి సీతమ్మ పెళ్లికూతురైంది. అమ్మవారికి ఏమాత్రం త గ్గకుండా రామయ్య కూడా అదేరీతిలో సర్వాభరణభూషితుడయ్యాడు. కల్యాణ ఘడియ కోసం భ క్తులు ఒళ్లంతా కళ్లుచేసుకొని వేడుకను తిలకించా రు. భక్తుల జయజయధ్వానాల మధ్య 3 లక్షల మంది భక్తజనుల సమక్షంలో అభిజిత్‌లగ్నంలో సీతమ్మను రామయ్య వైభవోపేతంగా పరిణయమాడాడు. ఒకవైపు స్వామివార్ల దివ్యకల్యాణం ఇ లా జరుగుతుంటే మరోవైపు శివపార్వతులు నెత్తి పై జీలకర్ర బెల్లం పెట్టుకొని శులాలు ఊపుతూ శివుడిని వివాహం జరుపుకొన్నారు. సీతారాముల ఉత్సవమూర్తులపై తలంబ్రాలు పడుతుంటే శివపార్వతులు వానజల్లులాగా అక్షింతలను చల్లుకున్నారు. శ్రీసీతారాముల కల్యాణానికి కన్యాదాతలుగా మాధవి గిరిధారచారి దంపతులు వ్యవహరించారు. ఈఓ రాజేశ్వర్, డీఆర్వో శ్యాంప్రసాద్‌లా ల్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఆర్డీవో పాడురంగారావు, నగర పంచాయతీ చైర్మన్ నామాల ఉమా లక్ష్మీరాజం, వైస్ చైర్మన్ ప్రతాప రామకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శి నాగుల విష్ణుప్రసాద్, డీఎస్‌పీ చంద్రశేఖర్, సీఐ వెంకటస్వామి తదితరులు కల్యాణోత్సవ వేడుకల్లో పాల్గొని కల్యాణమూర్తులను దర్శించుకున్నారు.

చిత్రం..కల్యాణానికి హాజరైన అశేష భక్తజనం