రాష్ట్రీయం

నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. వారం రోజులుగా లోక్‌సభలో ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానంపై చర్చకు ఆస్కారం లేకపోవటంతో మంగళవారం నుంచి ప్రత్యేక కార్యాచరణతో దిశానిర్దేశం చేసేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యూహరచన చేశారు. ఇందులో భాగంగా సోమవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని ముప్పాళ్లలో పార్టీ పార్లమెంటరీ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంపై వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా అవిశ్వాసం ప్రకటించటం, మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా వేరుగా అవిశ్వాస తీర్మానానికి సిద్ధం కావటంతో రాజీనామాల అస్త్రం ప్రయోగించాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 6న తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని జగ న్ ఇప్పటికే ప్రకటించారు. దీనిపై చర్చించేందుకు పార్లమెంటరీ పార్టీ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా 120వ రోజైన ఆదివారం రాత్రికి జగన్ ముప్పాళ్ల చేరుకున్నారు. సోమవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించాల్సి ఉన్నందున తాత్కాలికంగా పాదయాత్రను వాయి దా చేశారు. ఎన్డీయేపై అవిశ్వాసం విషయంలో ఇతర పార్టీలు కలిసి రానందున రాజీనామాలే చివరి అస్త్రంగా ప్రయోగించాలని భావిస్తున్నారు. రాజీనామాలు చేయటం ద్వారా టీడీపీని ఇరకాటం లో పెట్టేందుకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే రాజీనామా చేయకుండానే టీడీపీ ఎత్తులకు పైఎత్తులు వేస్తే మంచిదనే భావనను ఒకరిద్దరు సీనియర్ నేతలు వ్యక్తం చేస్తున్నట్లు తెలిసిం ది. అలాగే టీడీపీ విమర్శలను తిప్పికొట్టాలని పార్టీ నిర్ణయించిన ట్లు సమాచారం.