రాష్ట్రీయం

పీఎఫ్‌ఐ వస్తోంది..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: జాతీయ రాజకీయాల్లో ఇక నుండి క్రియాశీలకపాత్ర పోషిస్తానని సీఎం కే. చంద్రశేఖరరావు ప్రకటించారు. శాసనసభలో ద్రవ్యవినిమయ బిల్లుపై జరిగిన చర్చకు కేసీఆర్ మంగళవారం సమాధానమిస్తూ, కాంగ్రెస్, బీజేపీలు దేశానికి మంచి పరిపాలన ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యాయని విమర్శించారు. దేశంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం కీలకభూమిక పోషించనుందని ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ‘పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా’ అవిర్భవించబోతోందన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా న్యాయం గెలిచినట్టే, జాతీయ స్థాయిలో కొత్త ఫ్రంట్‌కు ప్రజల ఆదరణ లభిస్తుదని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రం పరిపాలనా తీరు పట్ల రైతులు సహా జాతీయ స్థాయిలో అన్ని వర్గాల వారు అసంతృప్తితో ఉన్నారన్నారు. దేశంలో 70 వేల టీఎంసీ నీరు అందుబాటులో ఉండగా, ఇందులో 40 వేల టీఎంసీ నీటిని మాత్రమే వినియోగించుకోగలుతున్నామని, మరో 30 వేల టీఎంసీ నీరు నిరుపయోగంగా పోతోందన్నారు. ఇతర సహజవనరులను కూడా పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నామన్నారు. గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఉద్యాన, విద్య, వైద్యం తదితర శాఖల్లో కేంద్రం రాష్ట్రంపై పెత్తనం చలాయిస్తోందన్నారు. అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం ద్రోహానికి పాల్పడుతోందన్నారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా మరొక శక్తి దేశానికి అవసరం ఉందని స్పష్టం చేశారు. దేశరాకీయాల్లో కీలకపాత్ర పోషిస్తానని ప్రకటించారు. ఈ పరిస్థితిలో దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావలసి ఉందన్నారు. మేధావులు తదితరులు కూడా ఇదే విధమైన అభిప్రాయంతో ఉన్నారని గుర్తు చేశారు. చైనా, జపాన్, సింగపూర్,
దక్షిణకొరియా తదితర దేశాల్లో అభివృద్ధిపనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయన్నారు. పాలకులు, ప్రజల్లో దేశంపట్ల అభిమానం, ప్రేమ ఉందని, నీతిగా, న్యాయంగా, ధర్మంగా ఆయా దేశాలు పనిచేస్తుండటమే అభివృద్ధికి మూలకారణమన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం రెండుకోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చిందని, ఇది అమలు కాలేదన్నారు. ఒకవేళ అమలైవుంటే తెలంగాణ వాటాకింద కొన్నివేల ఉద్యోగాలు రాష్ట్రానికి దక్కేదన్నారు. నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు తదితరులంతా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని కేసీఆర్ పేర్కొన్నారు.