రాష్ట్రీయం

నేడు నింగిలోకి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయంత్రం 4.56 గంటలకు ప్రయోగం
రెండో ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్

సూళ్లూరుపేట, మార్చి 28: అంతరిక్షంలో అద్భుతాలు సృష్టిస్తూ..్భతర కీర్తిపతాకాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెబుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) కేంద్రం నుంచి గురువారం సాయంత్రం 4గంటల 56నిమిషాలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 ప్రయోగం చేపట్టేందుకు శాస్తవ్రేత్తలు సర్వం సిద్ధం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట 56 నిమిషాలకు ప్రారంభమై సజావుగా కొనసాగుతోంది. ప్రయోగ దృష్ట్యా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ షార్‌కు చేరుకుని ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను శాస్తవ్రేత్తలతో కలసి పరిశీలించి కౌంట్‌డౌన్ ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. ఈ రాకెట్ సమాచార రంగానికి చెందిన జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. కమ్యూనికేషన్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఇస్రో 2140 కిలోల బరువుగల ఈ ఉపగ్రహాన్ని ఇస్రో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. గతంలో ఇంతటి బరువుగల ఉపగ్రహాలను పంపించేందుకు ఇస్రో విదేశాలపై ఆధారపడేది. ప్రస్తుతం ఇలాంటి అధునాతన ఉపగ్రహాలను పంపించేందుకు ఇస్రో స్వదేశీ క్రయోజనిక్ సొంతంగా రూపొందించి తద్వారా ఉపగ్రహాలను పంపించి విజయాలను అందిపుచ్చుకుంటోంది. కమ్యూనికేషన్ రంగం కోసం రూపొందించి జీశాట్ సిరీస్ ద్వారా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సేవలు పొందడమే కాకుండా విదేశాలకు సైతం సేవలు అందిస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా 2015 ఆగస్టు 27న ప్రయోగించిన జీశాట్-6 ఉపగ్రహాన్ని పంపించారు. దీని కాలపరిమిత 9సంవత్సరాలు అయిన కొన్ని సంకేతాలు అండడం లేదని శాస్తవ్రేత్తలు గుర్తించారు. దీంతో జీశాట్-6కు అనుబంధంగా ప్రస్తుతం దాని స్థానంలో ఇస్రో జీశాట్-6ఏను జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నా రు. ఈ ఉపగ్రహం మొబైల్ రంగానికి సం బంధించి కమ్యూనికేషన్ రంగంలో కీలకపా త్ర పోషించనుంది. ఇందులో ఎస్ బ్యాండ్, సీ బ్యాండ్ ట్రాన్స్ ఫాండర్లు ఎక్కువగా ఉ న్నందున కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత మెరుగుపరుచుకొనేందుకు వీలుంటుందని శాస్తవ్రేత్తలు చెబుతున్నారు. ఇది విజయవంతమైతే పదేళ్లపాటు సేవలు అందించనుంది. సమాచార రంగానికే కాకుండా భారత రక్షణ రంగానికి కూడా ఈ ఉపగ్రహ సేవలు ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇందులో అ మర్చిన కెమేరాల ద్వారా దేశ సరిహద్దులో 20 కి.మీ దూరంలో జరిగే కదలికలను ఛాయా చిత్రాలు తీసే సామర్థ్యాన్ని కూడా ఇందులో పొందుపరిచారు. కౌంట్ డౌన్‌లో భాగంగా రాకెట్‌లో రెండో దశలో నైట్రోజన్ హీలియం గ్యాస్‌తో పాటు ఇంధనం నింపే ప్రక్రియను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. రాకెట్‌లోని వివిధ దశల పనితీరును శాస్తవ్రేత్తలు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రయోగానికి 10గంటల ముందు రాకెట్‌కు విద్యుత్తు సరఫరా చేసి మిషన్ కం ట్రోల్ సెంటర్‌లో ఉన్న సూపర్ కంప్యూటర్ల కు అనుసంధానం చేస్తారు. జీఎస్‌ఎల్‌వీ ప్ర యోగం మూడు దశలో ప్రయోగం జరగనుంది. మొదటి దశలో ఘన ఇంధనంతో న డిచే స్ట్ఫ్రాన్ బూస్టర్ల ఇంజన్లతోపాటు మిశ్ర మ ఘన ఇంధనంలో నడిచే ప్రధాన ఇంజన్ ఉంటుంది. రెండో దశలో ధ్రవ ఇంధనాన్ని ఉ పయోగిస్తారు. మూడో దశలో అత్యంత కీలకమైన క్రయోజనిక్ ఇంధనాన్ని వాడతారు. రా కెట్ భూమి నుంచి నింగిలోకి ఎగిరినతర్వత మూడు దశల పూర్తియినంతరం రాకె ట్ శిఖర భాగాన ఉన్న జీశాట్-6 ఏ ఉపగ్రహాన్ని 17.46నిమిషాలకు కక్ష్యలోకి చేర్చుతోంది.