రాష్ట్రీయం

ఈ ఏడాది షార్ నుంచి 10 ప్రయోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ వెల్లడి
సూళ్లూరుపేట, మార్చి 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది 10 రాకెట్ ప్రయోగాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ అన్నా రు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 08 రాకెట్ ప్రయోగం ఉన్న నేపధ్యంలో విజయం కోసం ఆయన శాస్తవ్రేత్తలతో కలిసి బుధవారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకొ ని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేక రులతో మాట్లాడారు. కౌంట్‌డౌన్ సజావుగా కొనసాగుతుందని నిర్ధేశించి న సమయానికే జీఎస్‌ఎల్‌వీ ప్రయోగం జరుగుతుందన్నారు. ఈ ప్రయో గం ద్వారా శక్తివంతమైన కమ్యూనికేషన్ వ్యవస్థ సొంతం కానుందని పే ర్కొన్నారు. రానున్న రెండు వారాల్లో షార్ నుంచి మరో ప్రయోగం కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 12న పీఎస్‌ఎల్‌వీ-సి 41 రాకెట్ ద్వా రా నావిగేషన్ వ్యవస్థకు సంబంధించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఐ ఉపగ్రహా న్ని రోదసీలోకి పంపనున్నట్లు తెలిపారు.
అక్టోబర్‌లో చంద్రయాన్ ఉపగ్రహ ప్రయోగం
తిరుపతి, మార్చి 28: గురువారం నింగిలోకి పంపనున్న రాకెట్ నమూనాను ఇస్రో చైర్మన్ శ్రీవారి పాదాల చెంత ఉంచి పూజలు జరిపారు. ఈ సందర్భంగా శ్రీవారిని ఇస్రో చైర్మన్ శివన్ దర్శించుకుని రాకెట్ విజయవంతానికై పూజలు జరిపారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది మరిన్ని అద్భుతమైన ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని తొలుత భావించామని అయితే చర్చల్లో జాప్యంవల్ల అక్టోబర్‌లో ప్రయోగించాలని నిర్ణయించామన్నారు. అనంతరం శ్రీకాళహస్తిలో ముక్కంటీశుని దర్శించుకున్నట్లు తెలిపారు.