రాష్ట్రీయం

లీకు పేపర్లకు మళ్లీ.. పరీక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సీబీఎస్‌ఈ లీకైన పేపర్లకు మళ్లీ పరీక్ష నిర్వహించనున్నట్టు బోర్డు బుధవారం ప్రకటించింది. ప్లస్ టు పేపర్లు , పదో తరగతి పేపర్లు లీకైనట్టు మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నా తొలుత బుకాయించిన సీబీఎస్‌ఈ అధికారులు, ఎట్టకేలకు లీకేజీని అంగీకరించారు. దాంతో ప్లస్ ఎకనామిక్స్, పదో తరగతి మాథ్స్ పేపర్లను తిరిగి నిర్వహించనున్నట్టు బోర్డు కంట్రోలర్ బుధవారం ఢిల్లీలో ప్రకటించారు. మరోపక్క లీక్‌లకు బాధ్యులపైనా, పేపర్లను సామాజిక మాధ్యమాల్లో ఉంచిన వారిపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. మిగిలిన ప్రశ్నాపత్రాల లీక్‌పైనా బోర్డు ఆరా తీస్తోంది. కాగా రీ ఎగ్జామినేషన్‌కు సంబంధించి వారంలో షెడ్యూలు ప్రకటిస్తామని అధికారులు చెప్పారు. ఏప్రిల్ రెండోవారంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిసింది. అయితే బోర్డు నిర్ణయంపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని లీకైన పేపర్ల పరీక్షలను మళ్లీ నిర్వహించాలని బోర్డు నిర్ణయించినట్టు సీబీఎస్‌ఈ ప్రకటించినా, కంట్రోలర్ మాత్రం లీక్ కారణంగా పరీక్షలు మళ్లీ నిర్వహిస్తున్నట్టు చెప్పకుండా జరిగిన సంఘటనల నేపథ్యంలో అని పేర్కొనడం విడ్డూరం. సోషల్ మీడియా, మేసేజింగ్ యాప్ వాట్సప్ ద్వారా ఢిల్లీలోని రోహిణీ ప్రాంతంలో తొలుత సీబీఎస్‌ఈ 12వ తరగతి ఎకనామిక్స్ పేపర్ బయటకు వచ్చింది. అయితే పేపర్ లీక్ కాలేదని అధికారులు కొట్టి పారేశారు. అనంతరం లీకేజీ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. పేపర్ల లీక్‌పై ఆయన నిరసన కూడా వ్యక్తం చేశారు. లీకేజీ వ్యవహారంపై అప్పట్లో స్పందించిన సీబీఎస్‌ఈ వార్తలను కొట్టి పారేసింది. అన్ని పత్రాలు సీల్ వేసిన కవర్లలోనే జాగ్రత్తగా పరీక్ష కేంద్రాలకు పంపించామని, ఎక్కడా పేపర్‌లు లీక్ కాలేదని పేర్కొంది. తాజాగా ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ అంశంపై స్పందించి అసహనం వ్యక్తం చేయడంతో సీబీఎస్‌ఈ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. సిబిఎస్‌ఈ అకౌంటెన్సీ పేపర్ సైతం లీకైనట్టు విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం లీక్‌పై దర్యాప్తునకు ఆదేశించింది. అక్కడితో ఊరుకోని ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను సైతం నియమించింది. ఈ బృందాలు ప్రాథమికంగా పేపర్ లీక్ అయినట్టు నిర్ధారించాయి. రానున్న రోజుల్లో ఒత్తిడి లేని రీతిలో పరీక్షలు జరిగేలా, లీక్‌లను అరికడుతూ ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టిసారిస్తామని మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.