రాష్ట్రీయం

పునరావాసం సంతృప్తికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందుతున్న సాయం, పునరావాసంపై జాతీయ ఎస్టీ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రం అమలు చేస్తున్న ఆర్‌ఆర్ ప్యాకేజీపై కేంద్రానికి త్వరలో సానుకూలంగా నివేదిక ఇస్తామని బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సచివాలయంలో కలిసిన జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి చెప్పారు. సహాయ పునరావాస కార్యక్రమాల కోసం నిధులను త్వరితగతిన విడుదల చేసేలా కేంద్రాన్ని కోరతామని తెలిపారు. ఈ నెల 26, 27 తేదీల్లో పోలవరం ప్రాజెక్టును, ముంపు గ్రామాలను సందర్శించామని, పునరాస గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించామని వివరించారు. ప్రభుత్వ సాయంతో గిరిజనుల స్థితిగతులు మెరుగుపడ్డాయని, అయితే సాధ్యమైనంతవరకు భూమికి భూమిని పరిహారంగా ఇవ్వాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. పోలవరం ఎన్నో దశాబ్దాల స్వప్నమని, దానిని సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వుందని ఎస్టీ కమిషన్ చైర్మన్‌తో ముఖ్యమంత్రి అన్నారు. భూమిని కోల్పోతున్న గిరిజనులకు భూమిని ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నామని, భూమి ఇవ్వడమే కాదు సాగునీటిని నూటికి నూరుశాతం ఇస్తామని చెప్పారు. ముంపు గ్రామాల్లో ప్రజలకు పునరావాసంతో పాటు విద్య, వైద్యం, నైపుణ్య శిక్షణ, ఉపాధి, పునరావాస కాలనీలకు వౌలిక వసతుల కల్పన చేపట్టినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాంతంలో ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటుకు కృషి చేయాలన్న జాతీయ ఎస్టీ కమిషన్ సూచనకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ టౌన్‌షిప్ ఏర్పాటు చేయడమే కాకుండా పరిశ్రమలు నెలకొల్పేవారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు. ఒక్క గిరిజన కుటుంబం కూడా నష్టపోకూదన్నదే తన ఉద్దేశమన్నారు. సమీప భవిష్యత్‌లో ఇంతటి భారీ ప్రాజెక్టును భారతదేశంలో నిర్మించే అవకాశం లేదని వివరించిన ముఖ్యమంత్రి పోలవరం నవ్యాంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా అభివర్ణించారు. భేటీలో రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని, సీఎం ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఎస్టీ కమిషన్ వైస్ చైర్మన్ అనసూయనిఖి, సభ్యులు పాల్గొన్నారు.

చిత్రం..చంద్రబాబుతో సమావేశమైన జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ నందకుమార్ సాయి