రాష్ట్రీయం

ప్రత్యక్ష ఎన్నికలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: పంచాయతీలకు ప్రస్తుత విధానం ప్రకారమే ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతాయని పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. శాసనసభలో పంచాయతీరాజ్ బిల్లును ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టిన సందర్భంగా బిల్లులోని ముఖ్యాంశాలను శాసనసభ పక్షం కార్యాలయంలో మీడియాకు మంత్రి జూపల్లి వివరించారు. అలాగే ఎన్నికల్లో పార్టీల గుర్తులు ఉండబోవన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలకు అదనంగా కొత్తగా 4380 పంచాయతీలను ఏర్పాటు చేయడం వల్ల వీటి సంఖ్య 12,741కి చేరుకుంటాయన్నారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని బిల్లు ద్వారా నెరవేర్చారన్నారు. ఐదు వందలు అంతకంటే తక్కువ జనాభా ఉన్నవాటినీ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం ఐదేళ్లకోసారి పంచాయతీలకు రిజర్వేషన్ల కాలపరిమితి ఉండగా దీనిని ఇకనుంచి పదేళ్లకు పెంచుతున్నట్టు మంత్రి వివరించారు. గతంలో చెక్ పవర్ సర్పంచ్, గ్రామ కార్యదర్శికి సంయుక్తంగా ఉండగా ఇకనుంచి సర్పంచ్, ఉప సర్పంచ్‌కు సంయుక్తంగా కల్పించినట్టు తెలిపారు. ప్రతీ పంచాయతీలో ముగ్గురిని కో-ఆప్షన్ సభ్యులుగా నియమించుకునే విధానాన్నీ ప్రవేశపెడుతున్నామన్నారు. గ్రామ సభలను గతంలో ఆరు నెలలకోసారి తప్పనిసరిగా నిర్వహించాలనే నిబంధనను రెండు నెలలకు కుదించినట్టు మంత్రి తెలిపారు. అవకతవకలకు పాల్పడే సర్పంచ్‌లపై చర్య తీసుకునే అధికారం కలెక్టర్లకు కల్పించడంతో పాటు చర్యలపై అప్పీల్‌కు వెళ్లడానికి అవకాశం కల్పిస్తూ ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయనున్నామన్నారు. పంచాయతీల పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా ఉండేందుకు మరిన్ని బాధ్యతలు పెంచడంతోపాటు విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే చట్టరీత్యా చర్యలు ఉంటాయని బిల్లులో ప్రతిపాదించినట్టు తెలిపారు. గ్రామ పంచాయతీల నిధుల వ్యయంలో మరింత పారదర్శకత ఉండేలా చేస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ కొత్త చట్టంలో పంచాయతీల పాలక వర్గానికే కార్యనిర్వాహక అధికారాలు కల్పించామన్నారు. పంచాయతీ కార్యదర్శి పాలకవర్గానికి సబ్ ఆర్డినేట్‌గా ఉంటారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస విద్యార్హతను నిర్ణయించలేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షం లేకుండానే సభలో పంచాయతీరాజ్ బిల్లు ప్రవేశ పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేకపోయినా ప్రతిపక్ష కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే బయట ఉండేలా వ్యూహం ప్రకారం వ్యవహరించిందని మంత్రి విమర్శించారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి మాట్లాడుతూ పంచాయతీల ఏర్పాటుతో గిరిజన తండాలు, ఆదివాసి గూడాలకు కొత్త శకం ప్రారంభం కాబోతుందన్నారు. చెక్ పవర్ సర్పంచ్, ఉప సర్పంచ్‌కు సంయుక్తంగా కల్పించడం మంచి పరిణామమేనన్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం వల్ల పల్లెలకు కొత్త వెలుగులు రాబోతున్నాయని ఎమ్మెల్యే రసమయి బాల్‌కిషన్ కొనియాడారు.