రాష్ట్రీయం

రాజధాని శివార్లకు ఫార్మా పరిశ్రమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని పరిశ్రమల కాలుష్యం నుంచి రక్షిస్తామని, వచ్చే మూడు నెలల్లో నగరం నుంచి వంద పరిశ్రమలను శివార్లకు తరలిస్తామని మున్సిపల్ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ఫార్మా సిటీకి పర్యావరణ అనుమతులు వచ్చిన వెంటనే 400 ఫార్మా పరిశ్రమలను తరలిస్తామన్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో 185 చెరువులు ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్యే డాక్టర్ కె లక్ష్మణ్ అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ హైదరాబాద్‌లో రూ. 287.93 కోట్ల వ్యయంతో 20 చెరువులు పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. చెరువులోనికి ప్రవేశించకుండా మురుగునీటిని దారి మళ్లించడం కోసం మళ్లింపు కాల్వలు నిర్మిస్తున్నామన్నారు. హెచ్‌ఎండిఏ పరిధిలో 3132 చెరువులు ఉన్నాయన్నారు. పరిశ్రమలు వదిలే వ్యర్థ పదార్ధాల వల్ల చెరువులు కాలుష్యం బారిన పడుతున్నాయన్నారు. గృహ వ్యర్థ జలాల వల్ల చెరువుల్లో గుర్రపుడెక్క వ్యాపిస్తోందన్నారు. నగరంలో 100 కంటే ఎక్కువ ఫ్లాట్లు కట్టే అపార్టుమెంట్లలో కూడా మురికినీటి శుద్ధిప్లాంట్లు పెట్టాలన్న నిబంధన ఉందన్నారు.