రాష్ట్రీయం

1 నుంచి కాంగ్రెస్ మలివిడత బస్సుయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: రాష్ట్ర అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలు ముగియగానే వచ్చే నెల 1 నుంచి మలి విడత బస్సు యాత్ర చేపట్టాలని టి.పిసిసి నిర్ణయించింది. బుధవారం గాంధీ భవన్‌లో బస్సు యాత్ర రెండో విడతకు సంబంధించిన ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, కౌన్సిల్‌లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. సమావేశానంతరం టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి షబ్బీర్ అలీతో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. అసెంబ్లీ, కౌన్సిల్ నుంచి ప్రధాన ప్రతిపక్షాన్ని గెంటివేసి కీలకమైన బిల్లులను ప్రభుత్వం ఆమోదించుకున్నదని అన్నారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేసిందని విమర్శించారు. పార్లమెంటులో టిఆర్‌ఎస్ రిజర్వేషన్ల అంశాన్ని ముందు పెట్టి వారం రోజులుగా సమావేశాలకు ఆటంకం కలిగిస్తున్నదని విమర్శించారు. ఇక్కడ మాత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడాన్ని తాము వచ్చే నెల 1 నుంచి చేపట్టబోయే బస్సు యాత్ర సందర్భంగా ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. బస్సు యాత్రకు ఆదిలాబాద్ డిసిసి అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి కన్వీనర్‌గా కొనసాగుతారని, ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డిని కో-చైర్మన్‌గా నియమించినట్లు చెప్పారు. 1న సాయంత్రం రామగుండంలో సభ ఉంటుందని, రాత్రి అక్కడే బస చేసి మర్నాడు ఉదయం సింగరేణి కార్మికులతో సమావేశం కానున్నట్లు ఆయన వివరించారు. 2వ తేదీన పెద్దపల్లిలో, 3న మధ్యాహ్నం మంథనిలో, సాయంత్రం 6 గంటలకు భూపాల్‌పల్లిలో, 4న 2 గంటలకు స్టేషన్ ఘన్‌పూర్‌లో, సాయంత్రం 6 గంటలకు పాలకుర్తిలో, 5న సాయంత్రం 6 గంటలకు నర్సంపేటలో బస్సుయాత్ర, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.