రాష్ట్రీయం

ప్రైవేట్‌తో నష్టమేంటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును విపక్షాల వాకౌట్ల మధ్య శాసనసభ బుధవారం సాయంత్రం ఆమోదించింది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించాలని బిజెపి, టిడిపి డిమాండ్ చేయగా, బిల్లును ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. తమ సూచనలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ, టీడీపీ, సీపీఎం పార్టీలు సభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రభుత్వానికి ఎంఐఎం అండగా నిలిచింది. దాదాపు మూడు గంటల చర్చ అనంతరం బిల్లును మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ విద్యారంగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతిస్తున్నామన్నారు. ఇందుకు వీలుగా ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లును తీసుకువచ్చామన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌తో పాటు వివిధ కౌన్సిళ్లు రూపొందించిన నియమావళి మేరకే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నడుస్తాయన్నారు. తెలంగాణ నుంచి అనేక మంది విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళుతున్నారని, ఈ పరిస్థితిలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణలో విశ్వవిద్యాలయాలను నడిపేందుకు ముందుకు వచ్చే ప్రైవేట్ సంస్థలకు అనుమతిస్తామన్నారు. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు చదువుకునే అవకాశాలు మెరుగవుతాయన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల వల్ల తెలంగాణ బిడ్డలకు మేలు చేకూరుతుందన్నారు. జమ్మూకాశ్మీర్, గోవా, కేరళ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతించారని, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పాలిత రాష్ట్రాల్లో దాదాపు 282 ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు నడుస్తున్నాయన్నారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విశ్వవిద్యాలయాలను బలోపేతం చేస్తూనే ప్రైవేట్ రంగాన్నీ ప్రోత్సహిస్తామని కడియం తెలిపారు. 2018 నవంబర్‌లోగా ప్రభుత్వ పరిధిలోని అన్ని యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర, ఇతర సిబ్బందిని నియమిస్తామని కడియం హామీ ఇచ్చారు. అలాగే విశ్వవిద్యాలయాల్లో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు రూ. 420 కోట్ల రూపాయలు కేటాయించామని గుర్తు చేశారు. ఈ బిల్లును రాజకీయ లబ్దికోసమే విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు. బిల్లును సభ ఆమోదించాలని కడియం ప్రతిపాదించిన తర్వాత స్పీకర్ మధుసూదనాచారి దీన్ని సభ ముందు ఉంచి సభ ఆమోదించినట్టు ప్రకటించారు.