రాష్ట్రీయం

విశాఖ ఐటీలో మేటి ఫ్రాంక్లిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖటప్నం, మార్చి 28: విశాఖ ఐటీ చరిత్రలో మరో కీలక ఘట్టానికి బుధవారం అంకురార్పణ జరగనుంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థ, ఇన్నోవా సొల్యూషన్స్ సంయుక్తంగా సుమారు 450 కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సైన్స్ విభాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయబోతోంది. 51 లక్షల కోట్లతో నడుస్తున్న ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా తన శాఖను ఏర్పాటు చేయబోతోంది. ఇంటిగ్రేటెడ్ ఇన్నొవేషన్ పాలసీ కింద ఈ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. రానున్న ఎనిమిది సంవత్సరాల్లో 2,500 మందికి ఇందులో ఉద్యోగాలు లభించనున్నాయి. సాధారణ ఐటీ కంపెనీల మాదిరి ఇక్కడ ఉద్యోగుల జీత భత్యాలు ఉండవు. సాధారణ ఐటీ కంపెనీలో ఐదు, ఆరుగురు ఉద్యోగులకు కలిపి ఎంత జీతం వస్తుందో, ఈ సంస్థలో పనిచేసే నాన్ టెక్నికల్ ఉద్యోగికి అంత జీతం రానుంది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు కానున్న ఈ కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసే ఒక ఫ్రెషర్‌కు నెలకు నాలుగు లక్షల రూపాయల జీతం ఇవ్వనున్నారంటే సంస్థలో ఉద్యోగుల జీతాలు ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఈ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు కావల్సిన వౌలిక సదుపాయాలన్నీ యాజమాన్యమే కల్పించనుంది. రుషికొండ హిల్-3లో ఈ సంస్థ కోసం 40 ఎకరాలను కేటాయించారు. కంపెనీ కార్యకలాపాలు కొనసాగించుకునేందుకు కొంత స్థలాన్ని ఉంచుకుని, మిగిలిన స్థలంలో ఉద్యోగుల కోసం భవనాలు నిర్మించనున్నారు. వారి పిల్లలకు స్కూల్, హాస్పిటల్, మల్టీప్లెక్స్ తదితర సౌకర్యాలన్నీ కల్పించనున్నారు. ఇంటి నుంచి ఉద్యోగి కార్యాలయానికి కేవలం ఐదు నుంచి 10 నిముషాల్లో చేరుకునే విధంగా సౌకర్యాలు ఉండబోతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కంపెనీని గురువారం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టెంపుల్‌టన్ అధ్యక్షురాలు జెన్నీఫర్ జాన్సన్ హాజరవుతారు.
-------------------------
సీఎం ప్రారంభించనున్న మిలీనియం టవర్